రాష్ట్రీయం

ముత్యపు పందిరిపై ముల్లోకాల తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్10: పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన గురువారం ఉదయం ముల్లోకాల తల్లి అలమేలు మంగమ్మ ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. నిత్యకైంకర్యాలు ముగిసిన తర్వాత అమ్మవారి మూర్తిని వాహన మండపంలోవేంచేపు చేసి పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై అధిష్టింప చేశారు. అనంతరం భక్తుల కోలాటాలు , మంగళవాయిద్యాలు , జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అనంతరం అందాల తల్లి అలమేలు మంగమ్మ గురువారం రాత్రి యోగ నరసింహ స్వామి అలంకరణలో అమ్మవారు సింహ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. (చిత్రం) కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన గురువారం ఉదయం ముల్లోకాల తల్లి ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు