క్రీడాభూమి

టెన్నిస్ సూపర్ స్టార్ల అరుదైన మ్యాచ్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: టెన్నిస్ సూపర్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, మహేష్ భూపతి, మార్టినా నవ్రతిలోవా పాల్గొనే అత్యంత అరుదైన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నేడు ఇక్కడ జరగనుంది. ఆతర్వాత న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ అదే తరహా ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొనడం ద్వారా వీరు యువతలో టెన్నిస్ పట్ల ఆసక్తిని పెంచే ప్రయత్నం చేయనున్నారు. గతంలో మిక్స్‌డ్ డబుల్స్‌లో జంటగా గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న సానియా, భూపతి ఒక జంటగా, పేస్, ఒకప్పుడు ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన మార్టినా నవ్రతిలోవా మరో జంటగా ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు. కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న నవ్రతిలోవా భారత్‌లో టెన్నిస్ ప్రచారానికి సహకరిస్తున్నది. కాగా, హైదరాబాద్‌లో టెన్నిస్ అకాడెమీని నిర్వహిస్తున్న సానియా సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ క్రీడాకారులను పిలిపించి, ప్రచారం జోరును పెంచింది.