ఆంధ్రప్రదేశ్‌

వేళకురాని వైద్యులపై మంత్రి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించక పోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఆస్పత్రిని సందర్శించినపుడు వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించారు. వెంటనే వైద్యులకు ఫోన్లు చేసి రప్పించారు. ఈ ఒక్కరోజే ఇలా ఆలస్యమైందని వైద్యులు చెప్పగా, రోజూ చాలామంది డాక్టర్లు ఇష్టారాజ్యంగా వస్తుంటారని రోగులు మంత్రికి ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలా ఆలస్యంగా విధులకు వస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.