జాతీయ వార్తలు

తేజ్‌పాల్ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తనపై నమోదైన అత్యాచార కేసును కొట్టివేయాలంటూ తెహల్కా మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అతనిపై విచారణ కొనసాగించాల్సిందేనని, ఇప్పటి వరకు జాప్యం చేయటం తగదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసం పేర్కొంది. లైంగిక దాడి చాలా తీవ్రమైన నేరం. నైతికంగా అసహ్యకరమైన చర్య అని ధర్మాసనం పేర్కొంది. ఆరేళ్ల క్రితం నమోదైన ఈ కేసును ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం గోవా న్యాయస్థానాన్ని కోరింది. తరుణ్ తేజపాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ తెహల్కాలో పనిచేసే ఓ ఉద్యోగి 2012లో ఆరోపణలు చేసింది. తెహల్కా థింక్ ఫెస్టివల్ సందర్భంగా గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్ట్‌లో తరుణ్ తేజపాల్ తనపై లైంగికంగా దాడి చేశాడని ఆరోపించిన విషయం విదితమే. అప్పట్లో తేజపాల్‌కు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తుచేసుకోగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో తేజ్‌పాల్‌ను 2013 నవంబర్ 30న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత 2014 మే నుంచి తేజ్‌పాల్ బెయిల్‌పై బయట ఉన్నారు.