రాష్ట్రీయం

అయుత యాగానికి గాన కీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీవించ రావమ్మ మా చండీమాత..సంకల్ప యాగాన్ని సఫలమ్ము చేయ..
చండీ ప్రసన్నం కోసం పాటను రచించిన పంతులు
అందరి మన్ననలు పొందుతున్న ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి

సంగారెడ్డి, డిసెంబర్ 21: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మరుగునపడిన ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిని గులాబీ దళపతి కెసిఆర్‌కు యావత్ రాష్ట్రం సహకరించి రాష్ట్ర సాధించుకున్నట్లుగానే సిఎం హోదాలో బంగారు రాష్ట్రం కోసం పరితపిస్తూ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న సిఎంకు మరోమారు అన్ని వర్గాల సహకారం అందుతోంది. అధికారంలో ఉండి యాగం నిర్వహిస్తున్న సిఎంను చండీమాత ప్రసన్నం చేసి పూర్తి దీవెనలు అందించాలని మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి ప్రత్యేక పాటను రచించి ఆలపించారు. ‘దీవించ రావమ్మ మా చండీమాత..మా ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్ప యాగాన్ని సఫలమ్ము కావించ’ అనే పల్లవితో ఐదు చరణాలతో కూడిన నిడివిని రచించి ఆలపించారు.
తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ ఆలయాలైన ఓరుగల్లు భద్రకాళి, ఆలంపూర్ జోగులాంబ, బాసరలోని వీణవాణి, ఏడుపాయల దుర్గాంబ, మంజీర ఒడ్డున వెలసిన చాముండేశ్వరీ మాతలను కీర్తిస్తూ పాటను రచించారు. అయుత చండీయాగం నిర్వహణ కోసం తరలిరానున్న మహానుభావులు, పీఠాధిపతులను సైతం ఈ పాటలోకి అనునయించారు. బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సిఎం కెసిఆర్ ఆత్మ స్థైర్యంతో అడుగేసాడని, అంబ దీవెనతోటి సంకల్పాన్ని సాధిస్తారంటూ, బంగారు రాష్ట్రానికి బాటలు వేయగా, మా చండీమాత నిను వేడంగ రావా అంటూ పాటకు ముగింపు పలికారు. జిల్లా కలెక్టర్‌గా లతా కృష్ణారావు బాధ్యతలు నిర్వహించిన సమయంలో మంజీర అక్షర ప్రభ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృష్ణమూర్తి కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన బుర్రకథ గ్రామీణ ప్రజలను ఆకట్టుకోవడంతో కలెక్టర్ అభినందనలు పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎనే్నళ్లదో ఈ పోరాటం..ఎనే్నళ్లదో ఈ ఆరాటం అనే పాటను, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పోరాటం చేసి ఎంతగానో అలసి..సాధించిరి తెలంగాణ కెసిఆర్ గారు అనే గీతం, తెలంగాణ సంబురాల్లో భాగంగా తెలంగాణ వచ్చిందిరా సోదరా..సంబురాలు తెచ్చిందిరా సోదరా అనే పాటను రచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కవులు రచించిన పాటలు, కథలను పొగుడుతూ ఎన్నో ఏళ్ల పాట తెలంగాణుల నోట..ఎన్నో ఘోషల పాట తెలంగాణులు పాట అనే గేయాన్ని తన మదిలోంచి అక్షరాలను కూర్చుతూ రచించి పలువురి అభినందనలు పొందారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహిళా దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కృష్ణమూరి అనేక పాటలు రచించి విద్యార్థులతో పాడించారు. అయుత మహా చండీయాగాన్ని దేశంలోనే మొదటి ముఖ్యమంత్రిగా నిర్వహించిన ఘనతను చంద్రశేఖర్‌రావు దక్కించుకుంటుండగా ఆయనకు అమ్మ ఆశిస్సులు అందించాలని కోరుతూ కృష్ణమూర్తి రచించిన పాట అందరినీ ఆకట్టుకుంటుంది. సిఎం కెసిఆర్ మరోమారు వేన్నోళ్ల పొగడుతుండడం గమనార్హం. (చిత్రం) అయుత చండీయాగం విజయవంతం కావాలని సిఎంకు ఆశీస్సులు అందిస్తూ చండీ ప్రసన్నం కోసం పాటను రాసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి