బిజినెస్

టైటాన్‌లో పెరిగిన టాటా సన్స్ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: టైటాన్ సంస్థలో టాటా సన్స్ అదనంగా 0.22 శాతం వాటాను సొంతం చేసుకుంటోంది. 66 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడితో ఈ వాటాను టాటా సన్స్ దక్కించుకుంటున్నట్లు టైటాన్ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. కాగా, ఇనె్వస్ట్‌మెంట్ పోర్ట్ఫోలియో పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టాటా ఇంటర్నేషనల్ నుంచి ఈ వాటాను టాటా సన్స్ కొనుగోలు చేస్తోంది. తాజా వాటా కొనుగోలుతో టైటాన్‌లో టాటా సన్స్ వాటా 19.80 శాతానికి చేరుతోంది. ఆగస్టులోనూ 680 కోట్ల రూపాయలకుపైగా నిధులతో టైటాన్‌లో 2.18 శాతం వాటాను టాటా సన్స్ అందుకుంది.