రాష్ట్రీయం

తప్పులో కాలేశారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజా సస్పెన్షన్‌పై సర్కారుకు తలనొప్పి 340(2) ప్రకారం ఏడాది సస్పెన్షన్ సాధ్యమా?
హైదరాబాద్, డిసెంబర్ 19: అసెంబ్లీనుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం వివాదాస్పదమవుతోంది. సిఎం చంద్రబాబుపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించగా, మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె సస్పెన్షన్ వివాదం కావడానికి కారణం రూల్స్‌ను సరిగ్గా పాటించకపోవడమే. అసెంబ్లీ తీర్మానం ఆమోదించి ఏడాది, రెండేళ్లు, ఎంత కాలమైనా సస్పెండ్ చేయొచ్చు. అసెంబ్లీ తీర్మానాన్ని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ అధికారం లేదు. అయితే అసెంబ్లీ రూల్స్‌లో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (కౌల్ అండ్ షక్దర్)లో నిష్ణాతుడైన మాజీ స్పీకర్, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ఈ తప్పిదం చేశారు.
అదేమిటంటే అసెంబ్లీ రూల్స్ 340(2) ప్రకారం అంటూ ఆయన తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, ఏడాదిపాటు సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. వెంటనే తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు బల్లలుచరుస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈమేరకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా తీర్మానాన్ని ఆమోదమైందని, రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కిటుకంతా ఇక్కడే ఉంది. మంత్రి రామకృష్ణుడు పేర్కొన్న రూల్ ప్రకారమైతే సదరు సభ్యురాలైన రోజా లేదా మరెవరిని సస్పెండ్ చేయాలనుకున్నా, అది కేవలం ఆ సమావేశాల వరకే వర్తిస్తుంది. అంటే కొనసాగుతున్న సమావేశాలు ముగిసేంత వరకే అమలవుతుంది. తర్వాత సస్పెన్షన్ అమల్లో ఉండదు. ఇదే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. ఏడాది కాదుకదా ఎంత కాలమైనా సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి, స్పీకర్‌కు ఉన్నప్పుడు, అసెంబ్లీ రూల్స్ పుస్తకంలోని ఆ రూల్‌ను రామకృష్ణుడు చదవకుండా ఉండివుంటే ఇప్పుడు వివాదానికి ఆస్కారం ఉండేది కాదు.
ఎవరైనా సభ్యుడు అనుచితంగా ప్రవర్తించినప్పుడు సదరు సభ్యునిపై చర్య తీసుకోవాలంటే ఎలా? అంటే ఒకవేళ ఎవరైనా సభ్యుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు అనుచితంగా ప్రవర్తిస్తే సభ తీర్మానం ఆమోదించి వెంటనే ఎంతకాలమైనా సస్పెండ్ చేయవచ్చు. లేదనుకుంటే అసెంబ్లీ ప్రివిలేజెస్ (హక్కుల ఉల్లంఘన) కమిటీకి సిఫార్సు చేయొచ్చు. ఆ కమిటీ పూర్వపరాలు పరిశీలించి స్పీకర్‌కు నివేదిక ఇస్తుంది. నివేదికను స్పీకర్ సమావేశాల సమయంలో సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదంతో సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సభ్యుడు అసెంబ్లీ వెలుపల ఎక్కడైనా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టయితే దానిపై వచ్చే ఫిర్యాదును స్పీకర్ హక్కుల ఉల్లంఘన కమిటీకి సిఫార్సు చేస్తారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను సభముందు పెట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది.
కరణం బలరాం విషయంలో..
ఇలాఉండగా లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్‌గా కెఆర్ సురేష్ రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో స్పీకర్ సురేష్‌రెడ్డిపై ప్రతిపక్షంలో ఉన్న తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో, స్పీకర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజెస్ కమిటీకి పంపించారు. కమిటీ పరిశీలనచేసి నివేదిక ఇచ్చిన తర్వాత స్పీకర్ ఆయనను ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. ఇలాఉండగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడంతో ఆమె ఆటోమెటిక్‌గా శాసన సభ్యత్వాన్ని కోల్పోతారన్న ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా అవాస్తవం. రెండు సమావేశాలకు (ఆరు నెలలకు మించి) హాజరుకాకపోతే, స్పీకర్‌కు హాజరుకాకపోవడానికి గల కారణమేమిటో సమాచారం ఇవ్వకపోతేనే ఆ సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. రోజా విషయంలో సభనే ఏడాదిపాటు రాకుండా తీర్మానం ఆమోదించినందున, ఇక్కడ ఆ రూల్ వర్తించదు. (చిత్రం) అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి మార్షల్స్ అడ్డుకోవడంతో స్పృహకోల్పోయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజా