తెలంగాణ

బాబూ నీకు ఇక్కడేం పని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకూ ఓ అవకాశం ఇవ్వండి
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మారుస్తాం
హైదరాబాద్‌కు రీ ఇంజనీరింగ్ అవసరం
ఎంఐఎం మాకు మిత్రపక్షం
స్మార్ట్ సిటీల కేటాయింపులో కేంద్రం వివక్ష
విలేఖరుల సమావేశంలో కెసిఆర్

హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళంతా మా బిడ్డల్లాంటివాళ్లు.
వారికెలాంటి కష్టం కలగనివ్వం. పథకాల అమలులో అందరికీ సమానావకాశాలు కల్పిస్తాం.

బాబుకు ఇక్కడేం పని? హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నో పట్టణాలు ఉన్నాయి. అక్కడకెళ్లి అభివృద్ధి
చేసుకోవచ్చు కదా?

తినే తిండిని కూడా రాజకీయం చేస్తున్నారు... ఎంఐఎంది మతతత్వమో.. ఏ తత్వమో.. మాకు మాత్రం మిత్రపక్షమే.

హైదరాబాద్, జనవరి 28: భాగ్యనగరానికి బంగారు భవిష్యత్తును కోరుకునే వారు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. ‘ఉమ్మడి రాష్ట్రాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్, టిడిపిలు హైదరాబాద్‌లో ఏమీ చేయలేకపోయారు. టిఆర్‌ఎస్‌కు ఒక అవకాశం ఇవ్వండి విశ్వనగరంగా అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. హైదరాబాద్‌లో చేపట్టే పలు పథకాలగురించి, విపక్షాలు చేస్తున్న విమర్శలు, అభివృద్ధికి అవసరం అయిన నిధుల గురించి ఆయన విశదంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విమర్శలను విలేఖరులు ప్రస్తావించగా ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘చంద్రబాబుకు ఇక్కడేం పని? హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకు ఎన్నో పట్టణాలు ఉన్నాయి. వాటిమీద దృష్టి పెడితే మంచిది. అక్కడ పనులు చేయకుండా హైదరాబాద్‌లో ఏం పని? అమరావతికి నిధులు తెచ్చుకోలేని వాళ్లు హైదరాబాద్‌కు నిధులు తెస్తామంటున్నార’ని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో మీ స్నేహం ఎలా ఉందని విలేఖరులు ప్రశ్నించగా, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలో అలానే ఉన్నాయన్నారు. ఓటుకు నోటు కేసును విలేఖరులు ప్రస్తావించగా, ఎన్నికల తరువాత దాని గురించి మాట్లాడుకుందామని కెసిఆర్ బదులిచ్చారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశం జరుగుతుండగానే వచ్చిన స్మార్ట్ సిటీస్ జాబితాను చూపుతూ కేంద్రం 20 స్మార్ట్ సిటీలను ప్రకటించింది, తెలంగాణలో ఒక్కటీ లేదు, ఆంధ్రలో రెండున్నాయి ఇది వివక్ష కాకుంటే మరేమిటని ప్రశ్నించారు.
తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే లీకేజీ అవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారని ఒక విలేఖరి ప్రస్తావించగా, వాళ్లు తెలంగాణకు ఇచ్చిన ప్యాకేజీ ఏంటి? లీకైంది ఏమిటని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రాసకోసం వెంకయ్యనాయుడు ఇలాంటి మాటలు మాట్లాడతారని, ప్రాసకోసం అయితే నేను ఇంత కన్నా ఎక్కువ మాట్లాడగలనని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను రీ ఇంజనీరింగ్ చేయాలని అన్నారు. దీనికోసం మేధావులు, మీడియా ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తరువాత విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించే విధంగా రీ ఇంజనీరింగ్ ఉంటుందని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాటిలో కొత్తగా వచ్చిన పార్టీలు ఏమీ లేవని ఈ పార్టీలన్నీ మీకు తెలిసినవేనని అన్నారు. రాజకీయ నాయకులు ఇచ్చే హామీలకు, మాటలకు పన్నులు ఉండవు కాబట్టి ఏమైనా మాట్లాడతారని కానీ ఇచన మాటకు కట్టుబడి అభివృద్ధి చేసేది ఎవరు అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో మేం ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని చెబుతూ పాజిటివ్ దృక్పథంతోనే టిఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని కెసిఆర్ వివరించారు. వరంగల్ ఎన్నికల్లో ప్రజలకు ఇదే మాట చెప్పాను, ప్రజలు విపక్షాలకు డిపాజిట్ దక్కకుండా చేశారు. దాంతో వారిలో కొంత మార్పు వస్తుందని ఆశించాను, కానీ అలానే మాట్లాడుతున్నారని అన్నారు. నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతాను, ప్రజలను గాలికి వదిలేద్దాం అన్నట్టుగా విపక్షాల రాజకీయం సాగుతోందని అన్నారు.
బీఫ్‌ను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే దౌర్భాగ్య రాజకీయాలు జరుపుతున్నారని విమర్శించారు. చైనాలో పాములను కూడా తింటారు, ఎవరు తినేది వాళ్లు తింటారు దానికి రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. ఎంఐఎం టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షమని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంఐఎం సమావేశాన్ని నిర్వహించి టిర్‌ఎస్‌ను మిత్రపక్షంగా నిర్ణయించారని అన్నారు.
ప్రస్తుతం ఉన్న జూబ్లీ బస్‌డిపో, ఇలీ భన్ బస్‌డిపోలకు తోడు కనీసం మరో నాలుగు డిపోలు అవసరం అని కెసిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లకు తోడు చర్లపల్లితో పాటు మరో రెండు స్టేషన్ల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. చుక్క వర్షం పడినా రోడ్లు నిండిపోయే దుస్థితిని రూపుమాపుతాం. నాలుగేళ్లలో హైదరాబాద్ రూపు రేఖలు మారుతాయని తెలిపారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని చెప్పినట్టు హైదరాబాద్‌పై చెబుతారా? అని ప్రశ్నించగా, అలా సాధ్యం కాదని, కనీసం ఒక రూపు రావాలంటే నాలుగైదేళ్లు పడుతుందని అన్నారు.