తెలంగాణ

తెలంగాణలోనూ బ్రాహ్మల కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ బ్రాహ్మణ సమాజంలో ఆర్థికంగా వెనకబడిన పేదల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. సిఎం చంద్రశేఖరరావు ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమల్లో ఉంది. వీలైనంత త్వరగా బ్రాహ్మణుల సంక్షేమ సంస్ధకు మార్గదర్శకాలు ఖరారు చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఎన్నికల తర్వాత కార్పొరేషన్‌పై ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. సంస్ధ ఏర్పాటుకు విధి విధానాలను ఖరారు చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారిని సిఎం ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్ సహా పది జిల్లాల్లో బ్రాహ్మణుల సంక్షేమం కోసం, పేద విద్యార్ధులను ఆర్ధికంగా ఆదుకునేందుకు, ఉపకారవేతనాలు ఇవ్వడం, నిరుద్యోగులకు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై విధి విధానాలకు కసరత్తు చేస్తున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా అధ్యయనం చేయాలని కెసిఆర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బ్రాహ్మణుల్లో పేదలను ఆర్ధికంగా ఆదుకునేందుకు, అర్హులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇచ్చేందుకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు మంజూరు చేసే లక్ష్యంతో బ్రాహ్మణ సంక్షేమ సంస్ధను ఏర్పాటు చేసిన విషయం విదితమే.