తెలంగాణ

సెగ పెరిగిన గ్రేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మంగళవారం తెదేపా-్భజపా సంయుక్తంగా నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా కార్యకర్తల్లో మనోస్థైర్యం కల్పించాలని, గ్రేటర్ ఎన్నికల్లో తమదే విజయమన్న సంకేతం పంపాలని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. నిజాం కళాశాల ఆవరణలో విద్యా సంస్ధలు ఉన్నందున రాజకీయ పార్టీల బహిరంగ సభలకు అనుమతించమని పోలీసులు తొలుత చెప్పడంతో ఆ పార్టీల నేతలు నివ్వెరపోయారు. ఇంతకాలంగా ఎన్నో వందల బహిరంగ సభలకు అనుమతించి, ఇప్పుడు తమ విషయానికి వచ్చేసరికి నిబంధనలు చెప్పడం విడ్డూరంగా ఉందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డికి, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఆయన ఫోన్ చేయడంతో, చివరకు పోలీసులు ఆదివారం అనుమతిచ్చారు.
ఈనెల 28నుంచి మూడు రోజుల పాటు నగరంలో రోడ్ షో నిర్వహించేందుకూ రెండు పార్టీల నేతలు ముమ్మర యత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఇరు పార్టీల రాష్ట్ర నాయకులు పలు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. మరోవైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు ఒకవైపు మేనిఫెస్టో తయారీ, మరోవైపు అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై దృష్టి సారించారు.
దిగ్విజయ్ ప్రచార సభలు
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, టిపిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గ్రేటర్ పరిథిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని టి.పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తొలుత 12.30కు రాజేంద్రనగర్ సమీపంలోని ఆరాంఘర్ ప్రాంతంలోని మెట్రో క్లాసిక్ గార్డెన్‌లో, 2.30కు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల్ బస్తీలో ఉన్న రాంలీలా మైదానంలో, సాయంత్రం 5 గంటలకు బేగంపేటలో, రాత్రి 7 గంటలకు ఎల్‌బి నగర్‌లో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సభలను విజయవంతం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను కోరారు.

చిత్రం... తెదేపా-్భజపా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పార్టీల నాయకులు