రాష్ట్రీయం

2017నాటికి ఇంటింటికీ భగీరథ నల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, డిసెంబర్ 18: ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే ఐదు మాసాల్లో జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు తాగునీరు అందించాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.
జనగామ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేస్తున్న పనులను శుక్రవారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరితో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, జడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగామ మండలం అడవికేశ్వాపురం కుసుంబాయితండా, ఎసిరెడ్డినగర్‌లలో చేపడుతున్న ఓవర్ హెడ్ బాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల ప్రగతిని పర్యవేక్షించారు. ఈసందర్భంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులతో సంబంధిత పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పనులపై సమీక్షించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.840కోట్లు వెచ్చించిందన్నారు. తద్వారా జిల్లాలోని 704 ఆవాస ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించనున్నట్లు వివరించారు. నిర్ణీత గడువులోపే పనులు పూర్తిచేసి ప్రజలకు తాగునీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. మొదటి విడతలో భాగంగా మిషన్ భగీరథ పనులను 2016 ఏప్రిల్ 15నాటికి పూర్తి చేసి జనగామ నియోజకవర్గంలోని 5మండలాలతో పాటు జనగామ పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు సమయాని కంటే ముందే ట్రయల్ రన్ నిర్వహించాలని కోరారు. రెండో విడత మిషన్ భగీరథ కార్యక్రమంలో స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలోని 3మండలాలకు, మూడో విడతలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని 3 మండలాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ జి ప్రేమలతారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ యేసురత్నంతో పాటు స్థానిక రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో వివరాలు తెలుసుకుంటున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి