రాష్ట్రీయం

తొమ్మిది మంది పొగాకు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రాష్ట్రంలో పొగాకు రైతుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుశాసనసభకు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లిఖితపూర్వకసమాధానం ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో సింహాద్రి వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లాకు చెందిన బి కృష్ణారావు, వి చిన్నపోలిరెడ్డి, గొల్ల చిన్న అబ్బాయ్, నీలం వెంకటరావు, గంగవరపు హరిబాబు, వాక రమణ రెడ్డి, చాగంటి నరసారెడ్డి, కల్లూరి ఓబులమ్మ ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వచ్చే సంవత్సరానికి 60680.55 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు పంటను సాగు చేయడానికి పొగాకు మండలి అంగీకరించిందన్నారు. పొగాకు కొనుగోలు, నష్టపరిహారానికి సంబంధించి కిలోగ్రాముకు రూ.20 ప్యాకేజి ఇవ్వాలని, ప్రపంచ గిరాకీని దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్‌కు పొగాకు మండల పంట పరిణామాన్ని 120 ఎం కిలోలకు తగ్గించిందన్నారు. దీర్ఘకాల చర్యగా ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఎగుమతులను పెంచే సామర్ధ్యాన్ని పొగాకు మండలి సంబంధిత దేశాల్లోని భారతర ఆయబారుల ద్వారా పరిశీలిస్తోందన్నారు. వేలం పాట వేదికల్లో పోటీని పెంచేందుకు క్యాష్ అండ్ క్యారీ రిటైల్ ప్రాతిపదికన వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు విదేశీ కొనుగోలుదార్లను అనుమతించాలని ఆర్‌బిఐ సర్క్యులర్‌ను పొగాకు మండలికి జారీ చేశామన్నారు. అత్యధిక రేట్లకు భూమిని లేదా బ్యార్న్‌ను కౌలుకు తీసుకుని పొగాకు సాగు వద్దని రైతులకు పొగాకు మండలిని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. అనుమతించిన విస్తీర్ణానికి మించి పొగాకు పంట వేయవద్దని రైతులకు సలహా ఇస్తామన్నారు.