తెలంగాణ

రూ.702 కోట్లు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17 : తెలంగాణ రాష్ట్రాన్ని కరవు పరిస్థితి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ గత నెలలోనే 702 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకూ ఈ నిధులు పంట నష్టపోయిన రైతులకు చేరలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతులు గత ఆరేడు నెలల నుండి ఎదురు చూస్తున్నారు. కరవు పీడిత ప్రాంతాల్లో రైతులకు అండగా ఉంటామని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలుసార్లు ప్రకటించారు. కేంద్రం నుండి రైతులకు ఇచ్చేందుకు ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో నిధులు వచ్చిన మాట వాస్తవమేనని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్.మీనా కూడా ధ్రువీకరించారు. అయితే రైతులకు ఈ నిధులు ఎప్పుడు ఇస్తారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. వర్షాభావం వలన 2015 ఖరీఫ్ సీజన్‌లో పంటలు పండలేదు. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోగా, మరికొన్ని చోట్ల సగం దిగుబడి కూడా రాలేదు. పంటలకు జరిగిన నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం 863 కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదికను రూపొందించింది. రైతుల వివరాలు ప్రభుత్వానికి ఐదు నెలల క్రితమే వచ్చాయి. 2015 ఖరీఫ్ సీజన్ గత అక్టోబర్‌కే పూర్తయింది. 2015 డిసెంబర్ వరకే రైతుల పేర్లతో సహా అన్ని వివరాలను ప్రభుత్వం సేకరించింది. వివిధ శాఖలకు అవసరమైన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక పంపించింది.
ఈ నివేదిక ప్రకారమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్) నుండి నిధులు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు వచ్చిన ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులు కలుపుతుందా అన్న విషయం స్పష్టం కాలేదు. రాష్ట్రం రూపొందించిన నివేదికకు కేంద్రం ఇచ్చిన నివేదికకు 161 కోట్ల రూపాయల తేడా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 161 కోట్ల రూపాయలు జమ చేస్తే రూ.863 కోట్లు అవుతాయి. ఇలా జమచేశాక రైతులకు ఇస్తారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇన్‌పుట్ సబ్సిడీ అంశం వ్యవసాయ, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర శాఖల మధ్య నలిగిపోతోంది. బిహార్ ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఇచ్చేందుకు గత నెల 24వ తేదీన రూ.1750 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఇప్పటికే రైతులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రూ.56 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.

సచివాలయంలో ఉద్యోగుల ప్రమోషన్లకు కమిటీ
ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, మే 17 : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు ప్రమోషన్ ఇచ్చే అంశంపై పరిశీలన చేసేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ పేరుతో ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి, పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా, జిఎడి డిప్యూటీ సెక్రటరీ/జాయింట్ సెక్రటరీ/జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని జీఓలో పేర్కొన్నారు.

గీత కార్మికులకు
ఎక్స్‌గ్రేషియాగా 76 లక్షలు
2016 ఏప్రిల్ నుండి జూన్ వరకు జీఓ జారీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 17 : తెలంగాణ రాష్ట్రంలో గీతకార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించేందుకు ప్రభుత్వం 76,12,000 రూపాయలు మంజూరు చేసింది. తాటి, ఈత చెట్లు ఎక్కేప్పుడు, దిగేప్పుడు ప్రమాదాలకు గురయ్యే గీతకార్మికులకు సాయం అందిస్తారు. మరణించిన వారికి, గాయాలకు గురైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. 2016-17 బడ్జెట్ నుండి నాన్-ప్లాన్ పద్దు కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.