తెలంగాణ

కన్హయ్య రాక నేపథ్యంలో భద్రత పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఢల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మంగళవారం నగరానికి రానున్న సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్న పోలీసులు, ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ సంతాప సభలో కన్హయ్య పాల్గొంటున్నందున విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయవచ్చని తెలుస్తోంది. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుకు కన్హయ్య హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌సిసి గేట్ వద్ద పోలీసులను భారీగా మోహరింపజేశారు. ఇదిలావుండగా జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు హెచ్‌సియూ అధికారులు ప్రవేశానికి అనుమతి నిరాకరించినట్టు తెలిపారు. కాగా అధికారులు అనుమతివ్వకపోయినా రోహిత్ సంతాప సభ జరిగి తీరుతుందని, సభలో కన్హయ్య పాల్గొంటారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. పరస్పర వాదనల నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.