తెలంగాణ

ఇది చారిత్రక ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరినందున ఇక ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముంబయినుంచి హైదరాబాద్ చేరుకున్న కెసిఆర్ బృందానికి బేగంపేట విమానాశ్రయానికి తిరిగి వచ్చిన కెసిఆర్ బృందానికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మంత్రులు, పార్టీ శ్రేణులు, ఆయా జిల్లాల కార్యకర్తలు పెద్దఎత్తున విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. విమానాశ్రయ నుంచి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ జరిపారు. బేగంపేటలో స్వాగతం పలికిన వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణకు ఇక అన్నీ మంచిరోజులేనని అన్నారు. మహారాష్టత్రో కుదిరిన ఒప్పందంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కీలకపాత్ర వహించారని ప్రశంసించారు. అనేకసార్లు మహారాష్టత్రో చర్చించి ఒప్పందాలు కుదరడంలో కీలక భూమిక పోషించినట్టు చెప్పారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ముంబయి పర్యటన వివరాలను మంత్రులకు వివరించారు. రెండు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు నిర్మిద్దామనే ఆలోచనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన చేయనున్నట్టు కెసిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముందు వరంగల్, కరీంనగర్ జిల్లాలు సస్య శ్యామలం అవుతాయని, ఈ రెండు జిల్లాలు గోదావరి జిల్లాల మాదిరిగా మారబోతున్నాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా ఎలా ఉండేదో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా అంతే స్థాయిలో ఆ జిల్లాకు నీరు అందుతుందని, నిజామాబాద్ జిల్లాకు పూర్వవైభవం వస్తుందని తెలిపారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌పికి కూడా మేడిగడ్డ బ్యారేజి నుంచి నీరు పంపవచ్చునని తెలిపారు. ఉత్తర తెలంగాణతోపాటు అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు కూడా నీరు పంపే విధంగా ప్రాజెక్టులను డిజైన్ చేసుకోవాలని అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా పెద్దమొత్తంలో నీరు గోదావరిలో కలుస్తోందని, ఏడాదికి సగటున 2423 టిఎంసిల నీరు దిగువకు పోతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నీటిని పంట పొలాలకు అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో గోదావరిపై దమ్ముగూడెం బ్యారేజి నుంచి జగన్నాథపురం, రోళ్లపాడు రిజర్వాయర్ల ద్వారా జిల్లా మొత్తానికి నీరు అందించగలుగుతామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూ సేకరణ తదితర పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని , వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యే విధంగా అందరూ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కృతజ్ఞతలు
తెలంగాణ మహారాష్టల్ర మధ్య ప్రాజెక్టుల పై ఒప్పందం కుదరడంలో సహకరించిన మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఖరారు చేయనున్నారు.

మహారాష్టన్రుంచి ఒప్పందాలతో తిరిగివచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బృందానికి మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు. అనంతరం సిఎం క్యాంపు కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యం