తెలంగాణ

మున్సి‘పోల్స్’కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్/ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరుగనున్న ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 6,44,098 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 3,23,165 మంది, మహిళలు 3,20,814, ఇతరులు 119 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో 398 మంది అధ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందుకుగాను 653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని, ఎన్నికలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవిఎం మిషన్లను వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో భద్రపరుస్తామన్నారు. ఈ నెల 9న ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
వరంగల్‌లో అధికార పార్టికి ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకంటే రెబెల్స్ ద్వారానే పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది. మొత్తం 58 డివిజన్లకుగాను దాదాపు 10 డివజన్లలో తెరాస రెబెల్ అభ్యర్థులున్నారు. తెరాస అధికారిక అభ్యర్ధులకు వీరు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కొన్ని కీలక డివిజన్లలో రెబెల్ అభ్యర్థులు సొంత పార్టీ నాయకుల అండతోనే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మేయర్ పదవికి రేసులో ఉన్న అభ్యర్థుల డివిజన్లలోనే రెబెల్స్ గట్టి పోటీ ఇస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో తెరాస అధిష్టానం రంగంలోకి దిగి తమ మాట వినని రెబెల్స్ అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న నాయకులను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెరాస అభ్యర్థుల తరపున మంత్రి హరీష్‌రావు నామినేషన్ల పర్వం నుంచి ప్రచారఘట్టం ముగిసే వరకు వరంగల్‌లోనే మకాం వేశారు. ప్రచారంలో డిప్యూటీ సిఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు మంత్రి కెటిఆర్ రోడ్‌షో నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. అదే విధంగా బిజెపి అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పాల్గొని రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన ఆ పార్టీ రాష్ట్ర అగ్రనేతలంతా వరంగల్‌లోనే తిష్టవేశారు. టిడిపి కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. అంతా తామే అన్నట్లుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మూడు రోజులు నగరాన్ని చుట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టిడిపి వరంగల్ గ్రేటర్‌లోనైనా సత్తా చాటాలని ప్రయత్నం చేసింది.
ఖమ్మంలో..
దాదాపు ఐదేళ్ల తరావత ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 2,65,710 మంది ఓటర్లుండగా, మొత్తం 291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 265 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వివిపిటి పద్ధతి ద్వారా 43 చోట్ల వేసిన ఓటును సరి చూసుకునేందుకు ప్రింటర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌ను అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఓటర్ స్లిప్పు అనే యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను సెల్‌ఫోన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. పోలింగ్‌ను పరిశీలించేందుకు 10 ఎంసిసి టీమ్స్‌తో పాటు, అదనంగా మరో 10 టీమ్‌లను ఏర్పాటు చేశారు. 5 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను సందర్శించనున్నాయి. ఓటింగ్ సరళిని అన్ని చోట్ల కూడా వీడియో తీయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
ప్రలోభాల జాతర
ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక పార్టీ అభ్యర్థి ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే, మరో పార్టీ అభ్యర్థి 2వేలు ఇచ్చారు. కార్పొరేషన్‌లో నగదు పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టుకున్నది మాత్రం లక్ష రూపాయల లోపు మాత్రమే ఉండటం గమనార్హం.

ఈవిఎంలను సరిచూసుకుంటున్న ఎన్నికల అధికారులు

ఉత్తమ పోలీస్ వ్యవస్థ కోసం కృషి : డిజిపి

సంగారెడ్డి, మార్చి 5: రాష్ట్రంలో ఒక మంచి పోలీస్ వ్యవస్థను ప్రజలకు అందించేందుకు అన్ని రకాల కృషి చేస్తున్నామని డిజిపి అనురాగ్‌శర్మ అన్నారు. పోలీస్ స్టేషన్లపై ప్రజలకు ఉన్న భయాన్ని తొలగించి స్నేహపూర్వకంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి సూచిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో అందించే సేవలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నతమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల బాధలు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నామని, మహిళలు బయటకు చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారని, వీరి కోసం ప్రత్యేక మహిళా పోలీస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది కొరత ఉందని దీన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వచ్చే రిక్రూట్‌మెంట్‌లో 33 శాతం మహిళా కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. డిజిటలైజేషన్ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల సిబ్బంది కొరతను అధిగమిస్తున్నామన్నారు. ప్రధానంగా సిసి కెమెరాలు అనేక కేసులను పరిశోధించడానికి దోహదపడుతున్నాయని ఆయన సంతృప్తిని వ్యక్తం చేసారు. సంగారెడ్డి నుండి రామచంద్రాపురం వరకు నూతనంగా 90 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన (సిసి టివి) కమాండింగ్ కంట్రోల్ రూంలో కూర్చుండి చూస్తే హైవేలపై ఎలాంటి నేరాలు, ఘోరాలు, రోడ్డు ప్రమాదాలు, దారిదోపిడీలనైనా పసిగట్టే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి పోలీసులు విధించే జరిమానాలు నేరుగా చెల్లించుకునే విధంగా వాహన చోదకుల ఇంటి వద్దకే ఈ-చలాన్ పద్ధతిని జిల్లాలో అమలు చేస్తామన్నారు. రాబోయే కాలంలో విస్తృతమైన సేవలు అందించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఐజి నవీన్‌చంద్, ఎస్పీ బి.సుమతి తదితరులు పాల్గొన్నారు.