తెలంగాణ

పర్యాటక రంగం అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌డిసి) చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. నగరంలోని హుస్సేన్ సాగర్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లగ్జరీ బోట్లను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పేర్వారం రాములు మాట్లాడుతూ పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఆంధ్ర పాలకుల కారణంగా తెలంగాణలో పర్యాటక రంగం ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదని, ప్రస్తుతం సిఎం కెసిఆర్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రపంచ పర్యాటక రంగానికి అనుగుణంగా అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. టిఎస్‌డిసి ఇటీవల పర్యాటకులను దృష్టి పెట్టుకుని అడ్వెంచర్ హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిందని అయన తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం నూతన టూర్ ప్యాకేజీలను ప్రకటించి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించామన్నారు. వరంగల్ లక్కవరం, రామ్‌నాస్‌పురాలో ఉన్న లేక్ ప్రాంతాల్లో కాటేజీలను ఏర్పాటు చేశామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం మెదక్ ఫోర్టులో హరిత హెరిటేజ్ హోటల్‌ను, నగరంలోని తారామతి బారామతి సమీపంలో రిసార్ట్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగిన గోల్కొండ కోట, వరంగ్‌ల్ కోటలో అధునాతనమైన మ్యూజిక్ సౌండ్, లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భువనగిరి ఫోర్టులో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ అడ్వెంచర్ క్లబ్‌ను నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాట్లాడుతూ హుస్సేన్ సాగర్‌లో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోట్లను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.