తెలంగాణ

తెలంగాణ నోట్లో మన్నుకొడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 16: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకోకపోతే మరో మానుకోట సంఘటన చవిచూడాల్సి వస్తుందని, స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటే తాము ఇక చూస్తూ ఊరుకోబోమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు. సోమవారం మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని చెనాకకోర్ట బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, సమైక్యపాలనలో ఆరు దశాబ్దాలుగా గోసపడ్డ తెలంగాణ రైతులకు సాగుజలాలు అందించి, వారి బతుకులు బాగుపర్చేందుకే మహారాష్టత్రో ముఖ్యమంత్రి కెసిఆర్ గోదావరి జలాల ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. అయితే రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన వైకాపా, టిడిపి నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం మరోసారి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. కర్నూల్‌లో దొంగ దీక్ష చేస్తున్న వైఎస్.జగన్ కృష్ణాజలాల వాటాపై తేల్చుకునేందుకు ఇప్పటికైనా చర్చలకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. కృష్ణాబోర్డు నిబంధనల మేరకే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆవార్డు ప్రకారం 376 టిఎంసిలు తెలంగాణకు వాడుకుంటోందని, ఒక్క చుక్కకూడా ఆంధ్ర ప్రాంత నీరు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖలో ఖాళీగా ఉన్న 250 పోస్టులను వచ్చే నెలలోనే భర్తీచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
పెన్‌గంగా బ్యారేజీ పనుల పరిశీలన
పెన్‌గంగా నదీపై నిర్మిస్తున్న చెనాకకోర్ట బ్యారేజీ లెవెలింగ్ పనులను సోమవారం మంత్రి హరీష్‌రావు జిల్లా మంత్రులతో కలిసి పరిశీలించారు. వర్షాకాలానికి ముందే లెవెలింగ్ పనులు పూర్తిచేయాలని, నాణ్యతతో కాలువల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెనాకకోర్ట వద్ద 116 మీటర్ల ఎత్తులో ఎత్తిపోతల పనులు చేపట్టాలని, పింపర్‌వాడ్, రాజురా వద్ద 42 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే 51 వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు.

చిత్రం చెనాకకోర్ట బ్యారేజి పనుల మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రులు