తెలంగాణ

నాలుగు దశల్లో రుణమాఫీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒకటైన పంట రుణాల మాఫీకోసం కసరత్తు జరుగుతోంది. పది నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఒకటైన పంట రుణాల మాఫీకోసం అధికారికంగా పనులు జరుగుతున్నాయి. నాలుగు దశల్లో పంట రుణాల మాఫీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రెవెన్యూ, ఆర్థిక శాఖల అధికారులు బ్యాంకర్లతో ఈ అంశంపై చర్చిస్తున్నారు. బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న రుణాల్లో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేందుకు 18,000 కోట్ల నుండి 20,000 కోట్ల రూపాయలు అవసరం కావచ్చని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా లక్ష రూపాయల లోపు పంట రుణాలను
మాఫీ చేసింది. అప్పట్లో నాలుగు దశల్లో రుణమాఫీ చేశారు. రుణాల మొత్తం 17,500 కోట్ల రూపాయలుగా తేలింది. ఇప్పుడు మళ్లీ పంట రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో రెవెన్యూ, ఆర్థిక శాఖల అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రైతుల పేర్లతో సహా వివరాలు ఉన్నాయి. ఈ వివరాలను రెవెన్యూ శాఖాధికారులు సేకరిస్తున్నారు. వివరాల సేకరణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పనిలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, బ్యాంకర్ల సహకారంతో రుణమాఫీకి సంబంధించిన నివేదికను రూపొందించడంలో రెవెన్యూ శాఖాధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల అధికారులు వారి పరిధిలో ఉన్న అన్ని శాఖలకు (బ్రాంచ్‌లకు) లేఖలు పంపించారు. పంటల కోసం ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు? రుణాల మొత్తం ఎంత? లక్ష రూపాయల లోపు రుణాల మొత్తం ఎంత? రైతుల పేర్లు, వారి భూముల వివరాలు సర్వేనెంబర్లు, రైతుల ఆధార్ కార్డు నెంబర్లను కూడా పేర్కొంటూ జాబితాలను తయారు చేస్తున్నారు. బ్యాంకర్లు తమ వద్ద ఉన్న డటాను శాస్ర్తియ విధానంలో రూపొందిస్తున్నారు. పంట రుణాల మాఫీ పని బాధ్యతను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించడంతో తహశీల్దారులు, గిర్దావర్‌లు (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు), గ్రామ రెవెన్యూ అధికారులు (విఆర్‌ఏ) లు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖ సేకరించే డటా, బ్యాంకర్ల వద్ద ఉన్న డటాను క్రోడీకరించి రుణమాఫీ అమలు చేయాలని భావిస్తున్నారు. శాసనసభ తదుపరి సమావేశాల్లో రుణమాఫీకి సంబంధించి నిధుల కేటాయింపు జరుగుతుందని తెలుస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఓట్ ఆన్ అకౌంట్‌లో ఇందుకోసం పంటల రుణమాఫీ కోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, ఈ నిధులు విడుదల చేయలేదు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో పంటల రుణమాఫీకి సంబంధించి తుది కేటాయింపులు జరుపుతారని తెలుస్తోంది. తొలిదశ రుణమాఫీ అమలయ్యేందుకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని తెలిసింది.