Others

పల్నాటి యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: వెంపటి సదాశివబ్రహ్మం
మాటలు:
కొడాలి గోపాలరావు
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
కళ: గోఖలే
నృత్యం:
వెంపటి సత్యం
సంగీతం:
సాలూరి రాజేశ్వరరావు

1947లోని పల్నాటి యుద్ధానికి రచన చేసిన సముద్రాల (సీ) ఈ చిత్రంలో ఒక్క గీతాన్ని మాత్రమే వ్రాశారు. జాషువా పద్యాలతోపాటు సదాశివబ్రహ్మం ఒకటి, బసవలింగదేవర మరో పద్యం వ్రాయగా పాటలు మల్లాది రామకృష్ణశాస్ర్తీ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, పులుపుల శివయ్య వ్రాసారు.
పలనాటి సీమను అనుగురాజు కుమారుడు నలగామరాజు (గుమ్మడి) పరిపాలిస్తుండగా, సవతి సోదరులు మలిదేవుడు (బాలయ్య), నరసింగుడు (రాజనాల) అన్నపట్ల విధేయతతో ఉంటారు. మహామంత్రి బ్రహ్మనాయుడు (ఎన్టీఆర్)కు పుత్రుడు జన్మిస్తాడు. భార్య ఐతాంబ (అంజలిదేవి) కుమారునికి, నలగాముడు, సోదరుడు, తల్లి విజ్జలదేవి (హేమలత) ఆదేశంపై వారికి కానుకలిస్తారు. బ్రహ్మనాయుడు, వరదల పాలైన కడజాతి వారికోసం చెన్నకేశవ దేవాలయం తెరిపించి అన్న సంతర్పణ చేస్తాడు. దీనికి ఆగ్రహించిన గురువు గోపన్న మంత్రి (కెవియస్ శర్మ) నాగమ్మ (్భనుమతి)లో మతద్వేషం రగిల్చి, గురజాల తీసుకొస్తాడు. అనుగురాజు ఆమెకిచ్చిన దానపత్రం ప్రకారం 3 దినములు పాలన కావాల్సిన నాగమ్మ యుక్తివలన, బ్రహ్మనాయుడు మంత్రి పదవి వదలివేస్తాడు. భాగంకోరిన మలిదేవునికి నలగాముడు మాచెర్ల రాజ్యం ఇస్తాడు. నలగాముని ఏకైక కుమార్తె పేరమ్మ (వాసంతి)కి, కొమ్మరాజు(ముక్కామల) కుమారుడు అలరాజుకు గురజాలలో వివాహం జరుగుతుంది. ఆ పెళ్లి వేడుకలలో జరిగిన పంతాలు కారణంగా ఏర్పాటైన కోడిపందాల్లో నాగమ్మ కుట్రవలన, మలిదేవాదులు ఓడిపోతారు. షరతు ప్రకారం ఏడేళ్లు వనవాసం వెళ్తారు. గడువు పూర్తయి సంధికోసం అలరాజు(కాంతారావు)రాగా సంధి నిరాకరింపబడడమేకాక నాగమ్మ ప్రోత్సాహంతో నరసింగుడు ఇచ్చిన విషపానీయంవల్ల అలరాజు మరణిస్తాడు. నరసింగుని తల తీస్తానని బాలచంద్రునిచే శపథం చేయించి, పేరమ్మ సహగమనం చేస్తుంది. భార్య మాంచాల (జమున) అనుమతితో యుద్ధానికి వచ్చిన బాలచంద్రుడు (హరనాథ్), పరాక్రమంతో పోరాడి నరసింగుని అంతం చేస్తాడు. యోధులందరూ కలిసి ఒక్కటిగాచేరి బాలచంద్రుని హతమారుస్తారు. బాలచంద్రుడు మిగిలినవారిని సంహరించి తానూ మరణిస్తాడు. బ్రహ్మనాయుడు వీరావేశంతో పరాక్రమించి శత్రువులను నిర్జిస్తాడు. చివరకి నాగమ్మ, నలగాముడు వచ్చి బ్రహ్మనాయుని శరణుకోరగా, అతడు మన్నించి నాగమ్మనే మంత్రణిగా కొనసాగమని ఆశీర్వదించటంతో చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రంలో వేశ్యగా యల్ విజయలక్ష్మి, నాగమ్మ అనుచరుడు వీరభద్రం, త్యాగరాజు, ముక్కామల (కొమ్మరాజు) మిక్కిలినేని, కన్నమదాసుగా ప్రభాకర్‌రెడ్డి, ఛాయాదేవి, గంగారత్నం, వంగర ఇతర పాత్రలు పోషించారు.
ఎన్టీఆర్ బ్రహ్మనాయునిగా శాంతం, సహనం చూపుతూ ఇతరుల ఉద్రేకాలను శమింపచేస్తూ, మాలల దేవాలయ ప్రవేశంలో మహారాజు ముందు దోపిడి దొంగలవల్ల ప్రజల బాధలు వెల్లడించడంలో, తొలుత యుద్ధానికి, తరువాత సంధికి సిద్ధపడటం, కన్న కుమారుడు మరణించాక సమర భూమిలో చెలరేగి యుద్ధంచేయటం, నాగమ్మను క్షమించటంలో ఔదార్యం.. ఇలా పలు సన్నివేశాలు ఎంతో సంయమనంతో నటించారు.
భానుమతి తనదైన శైలిలో నాగమ్మ పాత్రను ఎంతో విలక్షణంగా, అలవోకగా ఓవిధమైన చిరునవ్వుతో పోషించి మెప్పించింది.
బాలచంద్రునిగా హరనాథ్, మాంచాలగా జమున తమ పాత్రలకు తగిన వైవిధ్యాన్ని నటనలో ప్రదర్శించారు. దర్శకులు రామినీడు 1947లో వచ్చిన పల్నాటియుద్ధం సన్నివేశాలను కొద్ది మార్పులతో, మరింత వైవిధ్యంగా తీర్చిదిద్ది ఈ పల్నాటి యుద్ధం (1966)ను రూపొందించారు.
బాలచంద్రుని పుట్టుక, వేడుకలు, అలరాజు, పేరమ్మల వివాహం, బాలచంద్రుడు వేశ్యా సాంగత్యంలో భార్యను విస్మరించటం, అలరాజు దూరమై పేరమ్మ, బాలచంద్రుని వియోగంతో మాంచాల వేదన, అలరాజు రాజ్యానికి రాకుండానే పాత చిత్రంలో హత్యాప్రయత్నం, ఈ చిత్రంలో గురజాల వచ్చాక సభలో సంధి, ప్రస్తావనలు, ఆపైన విషప్రయోగం, పానీయం ద్వారా మాంచాల, బాలచంద్రుని వెంట పురుష వేషంలో యుద్ధానికి వచ్చి భర్తకు సాయపడడం, బాలచంద్రుని వీరులందరొక్కటై గుమిగూడి సంహరించగా అంతకుమునుపు గాయపడిన మాంచాల పతివద్దకు చేరుకుని, అతని చేతిలో చేయివేసి ఇరువురూ ప్రాణాలు విడవడం, బ్రహ్మనాయుని విజృంభణ తదితర సన్నివేశాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
బాలచంద్రుడు పుట్టిన రోజునాడు అంజలిదేవి, ఛాయాదేవి, ఇతరులపై చిత్రీకరించిన గీతం -వెలుగొచ్చెనే లేత వెలుగొచ్చెనే కలవారి లోగిలికి (మల్లాది- స్వర్ణలత, వసంత బృందం గానం). భానుమతి ఈశ్వరుని పూజిస్తూ పాడే భక్తిగీతం -జయ శంభో శివశంకరా! జగదీశా స్వయంభో! ప్రభో (గానం భానుమతి, రచన సముద్రాల సీనియర్). హరనాథ్, యల్ విజయలక్ష్మిలపై చిత్రీకరించిన గీతం -రమ్మంటే రావేమిరా నారాజా రతిరాజా కిలకిల చిరునవ్వు (పి.సుశీల బృందం- కొసరాజు). వాసంతి, జమునలపై వేర్వేరుగా చిత్రీకరించిన గీతం -వెలుగే కరువాయె నిదురే రాదాయే బ్రతుకేమో (పి సుశీల, ఎస్ జానకి- రచన దాశరథి). జమున, హరనాథ్‌లపై చిత్రీకరించిన గీతం -శీలముగలవారి చిననాడ చివురంత దయలేని మొనగాడా (పి.సుశీల, మంగళంపల్లి- రచన మల్లాది). జమున, హరనాథ్‌లపై చిత్రీకరణ -మాచెర్ల చెన్నని మహిమ చేదోడు మాంచాల తిలకమ్మే నీకు (పి.సుశీల బృందం -మల్లాది). నేపథ్యగీతంగా వినిపించే పాట -శాతవాహన తెలుగుచక్రవర్తుల శౌర్యమిదె (బి.గోపాలం- రచన పులుపుల శివయ్య). వాసంతి, కాంతారావులపై చిత్రీకరించిన గీతం -తీయని తొలిరేయి ఇది తిరిగి రాని రేరుూ వేయి వేయి (పిబి శ్రీనివాస్, ఎస్ జానకి, రచన-మల్లాది). బ్రహ్మనాయుడు ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన పద్యాలు -అంటరాని తనంపు అడుసులో దిగబడ్డ కడజాతి’ (ఘంటసాల). -గర్భశత్రువుకాని కరుణింపుడన్నచో నెనరూనివాని (ఘంటసాల). పుట్టింపగలవు నిప్పుకల కుప్పలమంట (ఘంటసాల). సంవాద పద్యములు -అలుకమై బ్రహ్మనాయుడు (మధవపెద్ది, భానుమతి). -అరయనాడు పెద్దపులివై నలగామునింట చేరి (ఘంటసాల). భానుమతిపై చిత్రీకరించిన పద్యం -కులగోత్రము సంకోచంబు లేకుండ మాలలతో (్భనుమతి). రాజనాలపై చిత్రీకరించిన పద్యం -నా తల గొట్టిలెత్తునని నల్వురిలో శపథము (మాధవపెద్ది). హరనాథ్‌పై చిత్రీకరించిన పద్యం -పడవైతున్ నరసింహరాజు శిరమున్ (మంగళంపల్లి). వాసంతిపై చిత్రీకరించిన పద్యం -బుగ్గిఐనది నాదు ముత్తయిదువు తనంబు (ఎస్.జానకి). ఈ పద్యాల రచన జాషువా. భానుమతి పాడిన పద్యం -పలనాడీతని తాతదా ప్రజలనీ బ్రహ్మన్న సృష్టించెనా (రచన- సదాశివబ్రహ్మం). కాంతారావుపై చిత్రీకరించిన పద్యం -వచ్చితి దూతగా నిటకు బ్రహ్మనపంప’’ (పిఠాపురం- రచన జాషువా). జమున (మాంచాల)పై చిత్రీకరించిన భక్తిగీతం -అమ్మా బంగారు తల్లి నిను నమ్మిన కనె్నల కరుణించే వరదాయని (పి.సుశీల, రచన- మల్లాది). అనుభవజ్ఞులైన నటీనటులతో నిర్మించబడిన పల్నాటియుద్ధం చిత్రం అలరించేలా సాగుతుంది. ఈ చిత్రానికి జాతీయస్థాయిలో రాష్టప్రతి యోగ్యతాపత్రం లభించింది. (నాగమ్మ ముంజేతికి మీసం వుందని, నాగమ్మ యుద్ధం ముందు పౌరుషం చూపటం, అలరాజు రాయబారంలో మహాభారతంలోని శ్రీకృష్ణుని రాయబారంలా, బ్రహ్మనాయుడు మొదలైన వీరుల ప్రతాపాలు వర్ణించటం, ఏకొద్ది భూభాగం ఇవ్వటానికి నరసింహ, నలగాములు, నాగమ్మ అండలో ఇవ్వననటం, మాంచాల భర్తను దూరం చేయటానికి ముత్యాల దండ త్రెంపి ఏరితెచ్చి ఇమ్మనం, బ్రాహ్మణ యువకుడు అనపోతును యుద్ధానికి బాలచంద్రుడు రానీయకపోవటంతో, అతడు ఆత్మహత్య చేసుకోవటం వంటి విషయాలు ‘1947 పల్నాటియుద్ధం’లో లేనివి ‘1966 పల్నాటియుద్ధం’లో చొప్పించటం విశేషం.)

-సివిఆర్ మాణిక్యేశ్వరి