స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
నాయకుని లక్షణాలు
భువో యజ్ఞస్య రజసశ్చ నేతా యత్ర నియుద్భిః సచనే శివాభిః
దివి మూర్ధానం దధిషే స్వర్షాం జిహ్వామగ్నే చకృషే హవ్యవాహమ్‌॥

భావం:- నీవు నీతివంతుడవై ప్రవర్తించినపుడు, ఆకాశం దిశగా నీ శిరస్సు పైకెత్తబడి యున్నప్పుడు, వాక్కును నీ సుఖప్రాప్తికై మృదుమధురంగా వినియోగించుకొన్నప్పుడు యజ్ఞనిర్వహణలో మరియు లోకంలో నాయకుడవు కాగలవు.లోకంలో గాని, యజ్ఞ నిర్వహణలోగాని నాయకుడు కావడానికి మనిషికుండవలసిన లక్షణాలు ఈ మంత్రంలో వివరించబడ్డాయి.
యత్ర నియుద్భిః సచసే శివాభిః:- ‘‘శుభదాయకమైన నీతి ప్రవర్తన కలిగియున్నప్పుడు’’ అని ఈ వాక్యానికర్థం. ఒక పెద్ద జనసమూహాన్ని సన్మార్గంలో నడిపించే నైతిక బాధ్యత వహించేవాడే నాయకుడు. కాబట్టి అతడి ప్రతి చిన్న ప్రవర్తన ఆ జన సమూహానికి ఆదర్శమవుతుంది. అట్టివాడి ప్రవర్తనే జనసమూహానికి ప్రమాణమవుతుంది. అందు కే వేదం నాయకుడు నీతివంతుడు కావాలని విధించింది. ఈ భావానే్న గ్రహించి ధగవద్గీత
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥ (్భగీ.3-21)
శ్రేష్ఠుడైనవాడు దేనినాచరిస్తాడో దానినే ఇతరులు ఆచరిస్తారు. దానినేవారు ప్రమాణంగా స్వీకరిస్తారని స్పష్టంగా చెప్పింది. కాబట్టి నాయకుని ప్రథమార్హత నీతివంతుడు కావడమే. అట్లే ఒక యజ్ఞాన్ని నిర్వహించేవాడు కూడ నీతివంతుడు అయి యుండాలి. అంటే యజ్ఞాన్ని సమాజహితాన్ని కోరి చేసేవాడై యుండాలని భావం.
దివి మూర్ధానం దధిషే:- ‘తల నింగివైపు ఎత్తి తిరిగేవాడు కావాలి’అని దీని అర్థం. అంటే అహంకరించి అందరిముందు తల ఎగరేసేవాడు కారాదని దీని అర్థం కాదు. ఉన్నత జ్ఞానసంపన్నత కలిగి సమానులలో ఉత్తమ శ్లోకుడు కావాలనే పరిపూర్ణ జ్ఞానసంపన్నతాభావం జనహితానికి అంకితమవుతుంది కదా! అట్టి అంకితభావంతో కార్యనిర్వహణ చేసేవాడే జనులందరి చేత నాయకుడుగా ఆదరింపబడతాడు.
స్వర్నాం జిహ్వామగ్నే చకృషే హవ్యవాహమ్:- ‘నాయకుడు వాక్కును మధురంగా చేసి సత్ప్రయోజనాలను సాధించువాడుకావా’లని ఈ వాక్యానికర్థం. మధురంగా మాటలాటడట సామాన్య మానవుడికి సహితమెంతో ఆవశ్యకం. ఇక నాయకుడి విషయం చెప్పాలా? మాట మధురంగా లేకుంటే ఆప్తులు సహితం దూరమైపోతారు. కాబట్టి మధురమైన మాట నాయకుడికి ఆరోప్రాణం. ఇట్టి మధురమైన మాట ప్రాముఖ్యాన్ని గురించి మనువు మనుస్మృతిలో ఇలా వివరిస్తాడు.
అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో- ను శాసనమ్‌
వాక్ చైవ మధురా శ్లక్ష్ణాప్రయోజ్యా ధర్మమిచ్ఛతా॥ (మను.2-159)
‘‘్ధర్మాభిలాషి ప్రాణులను అహింసాపూర్వకంగా పాలించాలి. వారి ఎడల మృదుమధురమైన మాటలతోనే వ్యవహరించాలి’’. మాటలు మధురంగా ఉండాలన్నారు కాబట్టి కేవలం శుష్కప్రియాలు పలికి శూన్యహస్తాలు చూపడం కాక స్వర్షా= సుఖ కారకమూ మరియు ఆనందదాయకమూ అయిన ‘హవ్యవాట్’ మాటగా మాత్రమే పలకాలి. ఈ విషయాన్ని ‘నిరత్యయం సామ న దాన వర్జితమ్’ ‘‘ఏదీ ప్రదానం చేయబడని కేవల సాంత్వన వ్యర్థమే’ అన్న నీతి శాస్తక్రారుల వాక్యం మరింత స్పష్టపరుస్తుంది. జననాయకుడికయినా యజ్ఞనాయకుడికయినా విధిగా కలిగియుండదగినవిగా వేదం చెప్పిన ఈ లక్షణాలు సార్వకాలికాలు మరియుసార్వజనీనాలు.
**
కర్మలను చేస్తూనే నూరేండ్లు జీవించు
కుర్వనే్నవేహ కర్మాణి జిజీవిషేచ్ఛత సమాః
ఏవం త్వయి నాన్యథేతో- స్తి న కర్మ లిష్యతే నరే॥ శు.య.వే.40-2॥
భావం:- మానవుడు ఈ లోకంలో సత్కర్మల నాచరిస్తూనే నూరేండ్లు పూర్ణాయువుతో జీవించాలని కోరుకోవాలి. ఆ విధంగా చేసే మానవుణ్ణి ఆ కర్మ బంధన రూపంగా అంటి బాధించదు. ఇంతకు మించిన మరొక మంచి మార్గం లేదు. కర్మలు మూడు విధాలు. 1. సత్కర్మ. 2. వికర్మ 3. అకర్మ అని. ఏ కర్మ చేయకపోవడం అకర్మ. మంచి పనులను చేయడం సత్కర్మ. సత్కర్మకు వ్యతిరేకమైన దుష్కర్మల నాచరించడం వికర్మ. కాకపోతే ఏది సత్కర్మయో ఏది అకర్మయో నిర్ధారించుకోవడమంత సులభమైన అంశమేమీ కాదు. ఈ విషయంలో ‘కిం కర్మ కిమకర్మేతి కవయో- ష్యత్రమోహితాః’ (్భ.గీ.4-16) ‘‘ఏది సత్కర్మయో ఏది దుష్కర్మయో పండితులు సహితం భ్రాంతికి లోనవుతారు’’ అని గీత చెబుతూంది మరి నిర్ణయించుకొనేందుకు ఉపాయమేలేదా? అని శంక ఎవరికైనా కలుగుతుంది. దీనికి సమాధానంగా యజుర్వేదమే ‘మా గృధఃకస్యస్విద్ధనమ్’ (శు.య.వే.40-1) ‘‘ఎవరి ధనాన్ని చూచి అయినా దానికోసం ఆశపడకు’’ అని సూచించింది. ఆశను విడిచి చేసే కర్మ నిష్కామకర్మ అవుతుంది. అట్టి నిష్కామకర్మలనే ఆచరించుమని వేదం మానవుణ్ణి ఆదేశించింది. ఎంతకాలం ఆచరించాలి? ఈ ప్రశ్నకు కూడ బదులుగా ‘కురనే్నవేహ కర్మాణి జిజీవి షేచ్ఛత సమాః’ ‘‘నూరేండ్లు పూర్ణాయువు జీవించాలనుకొంటే సత్కర్మలనే ఆచరించు’’మని ఆదేశించి ‘‘ఏవం త్వయి నాన్యథేతో- స్తి’ ‘‘ఇంతకు మించిన మరో గొప్ప పద్ధతియే లేదు’’ అంటూనే వేదం ఇలా నిర్ధారించి చెప్పింది.

- ఇంకావుంది...