స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యవలన సుశిక్షితమైన హృదయంలో జనించే నీతి లేదా ధర్మమని అర్థం. ఎందుకంటే మానవుడుగా సృష్టించిన ద్రవ్యంగాని వస్తువుగాని లోకంలో లేదు. కాబట్టి దైవానికర్పించే వస్తువేదైనా అది భగవానుని సొత్తు మాత్రమే. అలా అర్పించాలంటే ముందుగా ఆ పరమాత్ముడిచేత మానవులకు ప్రదానం చేయబడాలి కదా. భగవానుడు ప్రదానం చేయని ద్రవ్యం మానవుడికెక్కడి నుండి ప్రాప్తమవుతుంది? కాని ఇట్టి ఆలోచన విద్యావివేకాల వలన సుశిక్షితుడైన మనిషికి మాత్రమే కలుగుతుంది. దానినే వేదం ‘సా విశ్వవారా సంస్కృతిః’ అందరూ పొందదగిన సంస్కృతి లేదా సంస్కారమని వచించింది.
ఈ విధమైన సంస్కారాలను మానవుడికి నేర్పేందుకే సృష్ట్యారంభంలో సర్వేశ్వరుడు అగ్ని, వాయువు, ఆదిత్యుడు అంగిరసులు అన్న నలుగురు జ్ఞానులను సృజించాడు. వారే మానవ జాతికి దయతో వేదజ్ఞానాన్ని ప్రసాదించారు. అలా వారి ద్వారా వేదజ్ఞానాన్ని అనుగ్రహించిన ‘స ప్రథమో మిత్రో వరుణో అగ్నిః’ ‘‘ఆ పరమేశ్వరుడే మిత్రుడు, వరుణుడు మరియు అగ్ని’’. మిత్రుడి కార్యం మిత్రుడికి హితాన్ని కలిగించడమే. సంసారమనే యుద్ధ్భూమిలోనికి వచ్చినతోడనే మనకు జ్ఞానమనే ఖడ్గాన్ని ప్రసాదించినవాడుగాన ఆయన మిత్రుడు. ఈ కారణంచేతనే ఆయన మనకభీష్టమైనవాడు గనుక వరుణుడు. మరియు జీవులమైన మనందరిని అభ్యుదయ పథంలో నడిపించేవాడు కావడం చేత ఆయన అగ్ని. ఆయనయే మొట్టమొదటగా ప్రబోధించేవాడు కాబట్టి ‘సఃప్రథమో బృహస్పతి శ్చికిత్వాన్’ (శు.య.వే.7-15) అతడు బృహస్పతి. ఈ రీతిగా మిత్రుడు, అగ్ని, వరుణుడు, బృహస్పతి రూపాలుగా ఆయనయే జ్ఞానప్రదాయకుడై సమస్త వరప్రదాత కావున ‘తస్మా ఇంద్రియ సుతమాజుహోత స్వాహా’ (శు.య.వే.7-15)
‘‘జ్ఞానైశ్వర్య సంపన్నుడు. అజ్ఞాన నివారకుడు అయిన ఆ పరమాత్మకు మనఃస్ఫూర్తిగా కలిగియున్న సమసె్తైశ్వర్యాన్ని సమర్పించి వేయు’’మని శుక్లయజుర్వేదం పునరుద్ఘాటించింది.
**
పరమాత్మ వెన్నంటే జగత్తు ప్రస్థానం
యస్య ప్రయాణమన్వన్య- ఇద్యయుర్దేవా దేవస్య మహిమానమోజసా
యః పార్థివాని వినమే స- ఏతశో రజాంసి దేవః సవితా మహిత్వానా॥

భావం:- ఏ భగవానుని గమనాన్ని అనుసరించి ఆయన వెంట ఇతర దేవతలందరూ కదలి వెళ్లిపోతారో అట్లే ఏ పరమాత్ముని మహత్తమశక్తి చేత ఈ బ్రహ్మాండంలో పార్థివ లోకాలన్నీ సృజింపబడ్డాయో ఆ సర్వోత్పాదకుడయిన భగవానుడే స్వీయ మహిమ కారణంగా సమస్తానికి చైతన్యప్రదాయకుడై యున్నాడు.
వివరణ:- ఈ మంత్రంలో జీవాత్మ- పరమాత్మానుసంధానం విశేషంగా ప్రస్తావించబడింది. వైదిక నిఘంటుకర్త అయిన నిరుక్తకారుని ‘దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా’ ‘‘ఇచ్చేది, ప్రకాశమయమైనది మరి యు ప్రకాశకమైయుండే పదార్థం దేవ శబ్దవాచ్యమవుతుంది’’అన్న నిర్వచనానుసారం ఆత్మ దేవశబ్దవాచ్యమవుతుంది. వేదాలలో పలుచోట్ల ‘ఆత్మ’జ్యోతిగా చెప్పబడింది. ఉదాహరణకు ‘ధ్రువం జ్యోతిర్నిహితం దృశ్యయే కమ్’ (ఋ.6-9-5) ‘‘సందర్శనం చేత సుఖప్రదాయకమూ, అవినాశి అయిన జ్యోతి శరీరంలో ఉంది’’అన్న ఋగ్వేద వచనానుసారం ఆత్మ ‘జ్యోతి’యే. ఈ ఆత్మ స్వయంప్రకాశకం కావడంతోబాటు ఇంద్రియాలకు తన ప్రకాశాన్ని ప్రదానంచేసి వానిని ప్రకాశింపచేస్తుంది. కాబట్టి నిరుక్త నిర్వచనానుసారం ఈ ఆత్మలతోబాటు మనస్సు,
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512