స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ ప్రశ్నకు సమాధానంగా యాజ్వవల్క్యుడు ఇలా సమాధానమిచ్చాడు.
‘మహిమాన ఏవై తేషామేతే, త్రయస్ర్తీంశత్వేవ దేవాః’ ‘‘సంఖ్యాపరంగా దేవతలు మూడువేల మూడువందల ముప్పది తొమ్మిది కంటె అధికమే. కాని ప్రధాన దేవతల సంఖ్య మాత్రం ముప్పది మూడు మంది మాత్రమే. ఈ దేవతలందరు ‘అగ్నిం అసపర్యన్’ ‘అగ్ని’ జీవుణ్ణి పూజిస్తారు.
ఆ పూజావిధాన మెట్టిది? అది ఈ మంత్రంలో ఇలా వివరించబడింది. ఔక్షన్ ఘృతైః’ ‘‘ఘృతం చేత ఆకర్షిస్తారు’’అంటే అగ్నిఘృతం చేత ప్రజ్వలితమవుతుంది. అనగా అగ్నిలోని అగ్నిత్వం జాగృతమవుతుంది అని అర్థం. ఇక్కడ అగ్ని అంటే జీవుడే కాబట్టి జీవునిలో భోగభోక్తృత్వగుణాన్ని ఈ దేవతలు ప్రజ్వలింపచేస్తారు అని అంతరార్థంగా గ్రహించాలి.
రెండవ పూజావిధానం ‘అస్తృణన్ బర్హిరస్మై’. అగ్నికొఱకు ఆసనం సిద్ధం చేయబడుతుంది అన్నది. అగ్నికి ఆసనం సిద్ధం చేయబడటం పొసగదు. అది హోత అధ్వర్యులకే సిద్ధంచేయబడుతుంది. ఈ వాక్యాన్నిబట్టి అగ్ని చైతన్యస్వరూపుడయిన జీవుడే. అతడి భోగోపలబ్ధికి సిద్ధంచేయబడిన ఆసనం- శరీరం. జీవుడు అందు ప్రవేశిస్తాడు. ఈ విషయమే ప్రతీకాత్మకంగా ‘అస్తృణన్ బర్హిరస్మై’అని వేదం వివరించింది. ఆ విధంగా శరీరాసనాన్ని సిద్ధంచేసేవారు ఆ దేవతలే. ఆ శరీరాసనాన్ని అధిష్టించిన జీవుడు భోగాలను అనుభవిస్తాడు.
మూడవ పూజావిధానం ‘ఆదిద్ధోతారం న్యసాదయంత’ ఆ తరువాత హోతను అనగా భోగాలను అనుభవించే భోక్తఅయిన ఆత్మను శరీరాసనంలో ఆయా దేవతలు ఆసీనపరుస్తారు. ఆ విధంగా ఆసీనమయిన ఆత్మ శరీరాసనంలో ఉండి సకల భోగాలను అనుభవిస్తుంది. ఆత్మకా భోగానుభవాన్ని కల్పించేది ఆ దేవతలే. ఆత్మకు (అగ్నికి) వారుచేసే పరిచర్య భోగానుభవాన్ని కల్పించడమే.
**
సరస్వతిలో (ఆత్మ)కలిసే ఐదు (విషయ) నదులు
పంచనద్యః సరస్వతీమపి యంతి సస్రోతసః
సరస్వతీ తు పంచధా సో దేశే- భవత్సరిత్॥ శు.య.వే.34-11॥
భావం:- ప్రవాహాలతో కూడిన ఐదు నదులతో సరస్వతీనది ప్రవహిస్తూ ఉంది. ఆ సరస్వతీ నదియే శరీరంలో ఉండి ఐదు విధాలయిన నదిగా ఉంది.
వివరణ:- ఈ మంత్రంలో వర్ణింపబడిన సరస్వతీనది భూమిపై ప్రవహించే సరస్వతీనది కాదు. భూమిపైగల నదియే అయితే మంత్రంలో ‘స రిత్ సరస్వతీ’అని పదబంధముండదు. ‘పంచనద్యః సరస్వతీమపి యంతి’ (ఐదు నదులు సరస్వతీనదిని చేరుతున్నాయి) అని మాత్రముంటే సరిపడేది. ఈ మంత్రంలో సరస్వతి శబ్దానికర్థం సరస్వతీనది కాదు. ఆత్మ మాత్రమే. ఐదు నదుల కర్థం ఐదు జ్ఞానేంద్రియాలని. వాటి ప్రవాహాలు జ్ఞానేంద్రియ సంబంధమైన విషయాలు. ఐదు జ్ఞానేంద్రియాలు తమ తమ విషయ రూపమైన ప్రవాహాలతోకూడి ఆత్మను చేరుతాయి. తాత్పర్యమేమంటె చక్షుః శ్రోత్ర జిహ్వాది పంచ జ్ఞానేంద్రియాలకు స్వతఃసిద్ధమైన కార్యకలాపాలేమీ లేవు. అవి సేకరించిన రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ జ్ఞానవిశేషాలను ఆత్మ స్వీకరిస్తుంది. ఆ విధంగా ఇంద్రియాల ద్వారా విషయాలకు ఆత్మభోక్త. ఈ ఆత్మను సరస్వతి నదిగా చెప్పడంలో ఒక ఔచిత్యముంది. సరస్వతీ శబ్దానికర్థం ప్రవాహం కలదని. శరీరాలెనె్నన్నో జీవుడికి వస్తూపోతూ ఉంటాయి. కాని వానిలో అవిచ్ఛిన్నంగా ఆత్మప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ప్రవాహాలు కొన్నిసార్లు స్వచ్ఛంగా మరి కొన్నిసార్లు మలినంగా ఉండవచ్చు. అదే విధంగా ఆత్మకూడ పాపవాసనల వలన మలినంగా, సుసంస్కారాల వలన స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛంగా ఉన్నా మలినంగా ఉన్నా శరీరాలలోనికి ఆత్మ నదిలో జలప్రవాహం వలె నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.
నేత్రలు రూపాన్ని, చెవులు శబ్దాన్ని, జిహ్వ రుచులను, నాసిక గంధాన్ని, చర్మం స్పర్శను ఇలా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు విషయాలను ఆత్మకు నిత్యము చేరవేస్తాయి. వేదం ఈ ఐదు విషయాలనే ఐదు ప్రవాహాలతో పోల్చి ‘సరస్వతీ తు పంచధా సో దేశే- భవత్‌సరిత్’ ‘‘సరస్వతీ నది (ఆత్మ) శరీర దేశంలో ఐదు నదులుగా ప్రవహిస్తూంది’’ అని ప్రతీకాత్మకంగా వర్ణించింది. ఆత్మ జ్ఞానేంద్రియ సంబంధమయిన విషయ సంస్కారాలకు వశమై విచిత్ర కర్మలను చేస్తుంది. జ్ఞానేంద్రియాలు ఐదువలె కర్మేంద్రియాలు కూడ ఐదే. ఆత్మలోని అంతర్గతమైన భావాలను బహిరంగంగా ప్రకటించేవి కర్మేంద్రియాలు.
- ఇంకావుంది...