స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మచారి కావడం మృత్యు రహస్యాన్ని తెలుసుకొనేందుకే. బ్రహ్మచారి మృత్యుదేవతకు శిష్యుడై మృత్యువును జయించగానే నిజమైన నూతన జన్మ ఆరంభమవుతుంది. ఆ విధంగా నూతన జన్మనొందిన బ్రహ్మచారిని దర్శించేందుకు ‘తం జాతం ద్రష్టుమభిసంయంతి దేవాః’ (అథ.వే.11-5-3) నలుదిక్కుల నుండి విద్వాంసులు వస్తారు.
హవిస్సు లేని యజ్ఞం
యజ్ఞానికి సమిధలు- నేయి- హవిస్సు- అగ్ని అవసరమైన ద్రవ్యాలు. అగ్నిలో సమిధలను వేయగా జ్వలించిన అగ్ని జ్వాలలో నేయిని- హవిస్సును సమర్పించినంతనే అందుండి అంతకుముందు లేని ఒక గొప్ప సుగంధం వెలువడుతుంది. అది వాయువులో కలిసి అంతటా వ్యాపించి వాయుశుద్ధిని చేస్తుంది. ఇది ఒక వైజ్ఞానిక సత్యం. దీనిని మరో రకంగా ప్రత్యాఖ్యానం (వ్యతిరేకించుట) చేయజాలం. ఇట్టి యజ్ఞాల ద్వారా వాయుశుద్ధిచేగాక యజ్ఞం ప్రదేశంలో ఉన్నవారి అంతఃకరణల శుద్ధికూడ కలుగుతుంది.
వేదం ఇట్టి ద్రవ్య యజ్ఞాలనేగాక ఇంతకంటే గొప్ప యజ్ఞాలను పేర్కొంది. వానిలో హవిస్సుగా ద్రవ్యాలనేవో అర్పించే బదులు యజమాని తననుతానే హవిస్సుగా సమర్పించుకొనవలసి యుంటుంది. ఇట్టి యజ్ఞాలను వేదం చాలా మహత్తరమైనవని ప్రశంసిస్తుంది. ఈ యజ్ఞాల స్వరూపాన్ని అథర్వణవేద మీవిధంగా వివరిస్తూంది. బ్రహ్మ హోతా బ్రహ్మ యజ్ఞా బ్రహ్మణా స్వరవో మితాః
అధ్వర్యుర్భ్రహ్మణో జాతో బ్రహ్మణోం-తర్హితం హవిః॥
బ్రహ్మస్తృచో ఘృతవతీర్ప్రహ్మణా వేదిరుద్ధితా
బ్రస్మయజ్ఞస్య తత్త్వం చ ఋత్విజో యే హవిష్కృతః. శమితాయ స్వాహా ॥ ॥
బ్రహ్మయే హోత. బ్రహ్మయే యజ్ఞం. సర్వసృష్టికర్త బ్రహ్మయే. బ్రహ్మనుండియే అధ్వర్యుడు జన్మించాడు. బ్రహ్మచేతనే హవిస్సు ఆచ్ఛాదింపబడింది. నేతితో నిండిన సృక్కులు బ్రహ్మయే. వేదిని నిర్మించింది బ్రహ్మయే. యజ్ఞతత్త్వం బ్రహ్మయే. అందుచేత శాంతికోసం స్వాహా.
ప్రపంచ శాంతిదాయకమైనదే గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞానికి హోత- అధర్వుడు. ఇతర ఋత్విక్కులు, బ్రహ్మయే కావాలి. అంతేకాదు. యజ్ఞ సంబంధ సర్వవిషయాలు బ్రహ్మయే కావాలి. యజ్ఞసాధనాలు, స్రుక్కు, స్రువం, వేదిక అన్ని బ్రహ్మమయం కావాలి. యజ్ఞతత్త్వసారం కూడ బ్రహ్మమయం కావాలి. ఈ విధంగా జరిగే యజ్ఞానికి శాంతిమయ స్వాహా అని వచించాలి. ఈ రీతిగా స్వాత్మీయమైన సర్వమూ బ్రహ్మార్పణం చేసి బ్రహ్మచేతిలో తానొక ఆయుధమైపోయిన యజ్ఞమే మహాయజ్ఞం. అంటే ఆ యజ్ఞానికి సర్వవిధాలకర్త బ్రహ్మయే కావాలి. ద్రవ్య యజ్ఞాలు ఇట్టి బ్రహ్మార్పణ యజ్ఞాలకు ప్రథమ సోపానాలు. ఇట్టి యజ్ఞాలలో యజ్ఞ్ఫలాన్ని ‘ఇదం న మమ’ ‘‘ఇది నా కొఱకు కాదు’’అని విశాల భావంతో ప్రధానంగా చెప్పాలి. ఏనాడు వాస్తవంగా ‘ఇదం న మమ’ అని చెప్పగలమో ఆనాడే బ్రహ్మయజ్ఞానికారంభం జరిగినట్లు కాగలదు.
***
- ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512