స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అట్లే దేశంలోని శత్రువులను, దుఃఖం, దారిద్య్రం ఇత్యాదులను పారద్రోలగలిగితే అది దేశసంబంధి అయిన అభిభువు. అదే విధంగా పరోపకారము మరియు సంఘటన శక్తిని వృద్ధిపరచితే అది యజ్ఞసంబంధి అయిన అభిభువు. ఇంద్ర-విద్యుత్తు అన్ని భౌతిక శక్తులలో చాల బలీయమైనది. వీనివలె అణచివేయగల సర్వశక్తి సంపన్నత కలగాలంటే దానికనుగుణమైన సాధన సంపత్తికూడ ఎంతో అవసరం. కాబట్టి ప్రతి వ్యక్తి ‘ఏవా విధేమాగ్ని హోత్రా ఇదం హవిః’ ‘‘ఇట్టి యజ్ఞానికవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకొనుచున్నాను’ అన్న దృఢ నిశ్చయం కలిగియుండాలి. అప్పుడు ఆ హవిస్సే కార్యసాధక మవుతుంది. అట్టి హవిస్సు నిర్మాణానికి తగిన సాధన సంపత్తిని సిద్ధపరచుకోవాలి. అది ఒక అద్భుత అగ్నిహోత్రం.
మృత్యుదేవతకు శిష్యుడైన బ్రహ్మచారి
మృత్యోరహం బ్రహ్మచారీ యదస్మి నిర్యాచన్ భూతాత్పురుష యమాయ
తమహం బ్రహ్మణా తపసా శ్రమేణానయైనం మేఖలయా సినామి॥॥
భావం:- ఓ దేవా! నేను మృత్యువునకు బ్రహ్మచారియైన శిష్యుడను, సమస్త మానవుల ఇంద్రియ నిగ్రహాన్ని వారి పురుషార్థాలను యాచిస్తున్నాను. వానిని కఠోర శ్రమ పూర్వకమైన తపస్సుచేత సాధించేందుకు కట్టిబద్ధుడనవుతున్నాను (సంసిద్ధుడనవుతున్నాను).
వివరణ:- బ్రహ్మచారి మహిమ అథర్వణవేదంలో పదకొండవ కాండ ఐదవ సూక్తంలో విపులంగా వర్ణింపబడింది. అందలి ఆరవ కాండ నూటముప్పది మూడవ సూక్తం కూడ బ్రహ్మచర్య సంబంధమైనదే. దీనిలో బ్రహ్మచారి సంబంధమైన బహిరంగ మేఖల (నడుమునకు కట్టుకొనే త్రాడు) కౌపీన ధారణల (గోచి) మాహాత్మ్యం చెప్పబడింది. ఈ మంత్రంలో చెప్పబడిన బ్రహ్మచారి వర్ణన సామాన్య బ్రహ్మచారులందరికంటె విలక్షణమైనది. అందు మొదటి విలక్షణత ‘మృత్యోరహం బ్రహ్మచారీ’ ‘‘నేను మృత్యుదేవతకు శిష్యుడనైన బ్రహ్మచారిని’’అన్నది. మృత్యుదేవతను గురువుగా స్వీకరించడం అసాధారణమైన విషయం. మరియు దుష్కరం కూడా. చిత్రమేమంటె మృత్యుదేవతకు శిష్యుడగు బ్రహ్మచారి నచికేతుని వంటి వాడెవడో నిస్సందేహంగా జ్ఞానియే అవుతాడు. సమస్త ప్రపంచాన్ని అపారమైనదిగా గ్రహించి మృత్యువు జీవులకు తప్పక సంభవించేదే అని భావించి అది అపూర్వమైన ముక్తిని ప్రసాదించేదిగా నమ్మిన ఆ బ్రహ్మచారియే మృత్యువువద్దకు సులభంగా ధైర్యంగా వెళ్లగలడు. మృత్యువు అందరు భావించిన రీతిగా భయావహమైనది గాదని అథర్వణవేదం-ఆచార్యో మృత్యుర్వరుణః సోమ ఓషధయః పయః
జీమూతా ఆసన్ సత్వానసె్తైరిదం స్వ రాభృతమ్‌॥ (అథ.వే.11-5-14)
‘‘ఆచార్యుడు, మృత్యువు, వరుణుడు, సోముడు, ఓషధులు, జలం లేదా పాలు, మేఘాలు ఇవి జీవులకు స్వః= సుఖాన్ని కల్గించే శక్తిని ధరించినవి’’అని స్పష్టంగా పేర్కొంది.
- ఇంకాఉంది