స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. నృచక్షసః:- పశుపక్ష్యాదులను మరియు వానికంటె విశిష్టత కలిగిన మనుష్యులను ప్రేమించి, భోగాసక్తి విడిచి ఆత్మపరమాత్మల వివేచనలో తన్మయులై ఇతరులకు కూడ ఆ అనుభవాన్ని పొందే ప్రేరణ కలిగించేవారు కావాలి.
2. అనిమిషంతః:- ఆలస్యం, ప్రమాదం మున్నగు యోగసాధన విరోధభావాలను జయించి ముక్తిసాధనోపాయ అనుస్థానంలో క్షణంకూడ ఏమరుపాటు లేక ఉండేవారు కావాలి. వారి నిష్ఠ వానియెందెంత గాఢంగా ఉండాలంటే ‘గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్’ జుట్టు పట్టుకొని మృత్యుదేవత లాగుచున్నదని భావించి తొందర తొందరగా ధర్మమాచరిస్తూ ఉండాలి.
3. అర్హణాః:- భగవదారాధన తత్పరుడై పూజ్యత పొందాలి.
4. దేవాసః:- భగవత్తత్త్వదర్శియై నిష్కామభావంతో కర్మాచరణ చేయువాడు కావాలి.
5. జ్యోతీరథాః:- జ్ఞానరథారూఢులు కావాలి. అంటే ఆత్మ- పరమాత్మలను- జన మరణ చక్రభ్రమణ రూప సంసారాన్ని సంపూర్ణంగా తెలిసినవారు కావాలి.
6. అహిమాయాః:- శక్తివంతన లేకుండా జ్ఞానయుతంగా సత్కర్మాచరణ చేయువారు కావాలి.
7. అనాగసః:- పాపకర్మలకు బహుదూరంగా ఉండాలి.
8. దివో వర్ష్మాణం వసతే స్వస్తయే:- జ్ఞాన బలసంపన్నులై దేవదేవుని కృపాబలాన్ని పొంది దానిని సమాజహితానికి అంకితం చేయగల ఉదార స్వభావులు కావాలి.
మోక్ష సాధనకు ఈ ఎనిమిది క్రమసోపానాలుగా వేదం ప్రతిపాదించింది. ముముక్షువులీ ధర్మాలను దైవశాసనంగా శిరసావహించి ముక్తిలక్ష్యాన్ని చేరుకోగలరు.
**
నీవు లేక ముక్తానందమే లేదు
మహాన్ అస్యధ్వరస్య ప్రకేతో న ఋతే
త్వదమృతా మాదయంతే ఆ విశే్వభిః సరథం యాహి
దేవైర్న్యగ్నే హోతా ప్రథమః స దేహ॥ ఋ.7-11-1॥
భావం:- ఓ పరమాత్మా! నీవు మార్గదర్శకులకు సహితం మార్గదర్శకుడవు. హింసారహిత కర్మలకు జ్ఞానదాతవు. ముక్తపురుషుడవు కూడ నీవే. నీవులేక మేము ఆనందాన్ని పొందజాలం. పరిపూర్ణమైన దివ్యగుణాలతో ఆనంద సాధక సామగ్రీ సమేతుడవై జగమంతట వ్యాపించియున్నావు. ఈ లోకంలో మొదటి హోతవు నీవే.
వివరణ:- మోక్షదశలో దుఃఖ స్పర్శయే లేని సదా ఆనందానుభవమే కలుగుతుంది. కాబట్టి అందరు మోక్షాన్ని జీవితపరమార్థంగా ఎంచుకొంటారు. అసలు ఈ సృష్టిలో జీవుల కార్యకలాపమంతా ఆనందసిద్ధికొఱకే. దుఃఖ స్పర్శలేని బ్రహ్మానంద స్థితిని పొందే ఉపాయాన్ని భగవానుడు తప్ప మరెవ్వరు ఉపదేశింపజాలరు. ఈ మాట వేదమే ‘మహాన్ అధ్వరస్య ప్రకేతః’ ‘‘మోక్షసిద్ధికి మార్గదర్శన సమర్థుడవు, ఉత్తమ ప్రబోధకుడవు నీవే’’అని స్పష్టంగా చెప్పింది. అందుకే దైవాన్ని ఇలా ప్రార్థించుమని వేదమాదేశించింది.‘ఆ విశే్వభి సరథం యాహి దేవైః’ ‘‘ఆనంద నాయక సాధనాలతో ప్రపూర్ణుడవై దివ్యగుణ సహితుడవై సర్వత్ర వ్యాపించిన నీవు మాకు సన్నిహితుడవగుదువుగాక’’! అట్టి ప్రార్థన ఎందుకంటే-
‘యస్య దేవైరాసదో బర్హిరగ్నే- హాన్యస్మై సుదినా భవంతి’(ఋ.7-11-2) ‘‘ఎవని హృదయంలో దివ్యగుణ సంపన్నుడైన భగవానుడు సదా విరాజమానుడై యుంటాడో అట్టివానికి దినాలన్ని శుభదినాలే’’కాబట్టి భగవత్సాంగత్యం సిద్ధించిన వానిక దుఃఖం, దారిద్య్రం, అశక్తత మొదలైన దుర్గుణాలన్నీ నశించిపోతాయి. సుఖం, సమృద్ధి, ఐశ్వర్యం, శక్తి మొదలైన సర్వసంపద్వైభవం ప్రాప్తమవుతుంది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512