స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామి వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ విధంగా విద్వాంసుడు పరిశుద్ధుడైనంతనే అతడు ‘మహీరపో వి గాహతే’ ‘‘మహా జలాలలో స్నానమాచరిస్తాడు.’’ జలమంటే ఇక్కడ నీరుకాదు. వైదికంగా సూక్ష్మాతిసూక్ష్మమైన కర్మ విశేషాలని అర్థం. వీనిలో స్నానమాచరిస్తాడు అంటే ‘నిపుణంగా నిర్వహించగలడు’ అని అర్థం. తద్వారా ఆ జ్ఞాని లేదా విద్వాంసుడు విద్వాంసులనుండి పుట్టి విద్వాంసుల కొఱకై ఉద్భవించిన మహామనీషి కాగలడు.
***
ఏడు మర్యాదలు
సప్త మర్యాదాః కవయస్తతక్షుస్తాసామేకామిదభ్యంహురో గాత్‌
ఆయోర్హ స్కంభ ఉపమస్య నీళే పంథా విసర్గే ధరుణేషు తస్థౌ॥ ఋ.10-5-6॥
భావం:- మహాత్ములైన జ్ఞానులు మానవులు విధిగా ఆచరించదగిన ఏడు నియమాలను ఏర్పరచారు. వానిలో ఏ ఒక్కదానిని అతిక్రమించినా అతడు మహాపాపి అవుతాడు. ఆపదల సమయంలో ఆ ఏడు మర్యాదలను అనుసరిస్తూ అనుసరణీయుడైన భగవానుని ఆశ్రయంలో ఉంటాడో అతడే నిజంగా అభ్యుదయ మార్గంలో నడిచేవారికి స్తంభం వంటి స్థిరులైన మహా జ్ఞాని.
వివరణ:- మంత్రంలో మహాత్ములైన జ్ఞానులు మానవులు విధిగా అనుసరించదగిన మర్యాదలను ఏడింటిని ఏర్పరచారని చెప్పబడింది. అవి ఇవి
1. అహింస:- మనసా, వాచా, కర్మణా ఎవరికీ హాని తలపెట్టకుండుట.
2. సత్యం:- యథార్థజ్ఞానాన్ని సముపార్జించి తదనుసారంగా నడుచుకొనుట.
3. అస్తేయం:- దొంగతనం చేయకుండుట.
4. బ్రహ్మచర్యం:- భార్యయందు తప్ప ఏ స్ర్తియెడల కామదృష్టి లేకుండుట. వేదాధ్యయన పూర్వకంగా వీర్యరక్షణ చేసుకొనుట.
5. శౌచం:- శారీరక, మానసిక, ఆత్మిక పరిశుద్ధత, వ్యవహార శుద్ధి.
6. స్వాధ్యాయం:- ఆత్మచింతన, ఆత్మ, అనాత్మ వివేచన. వంశానుగతమైన వేదాధ్యయన పఠనం.
7. ఈశ్వర ప్రణిధానం:- సర్వకర్మలు బ్రహ్మార్పణ బుద్ధితో ఆచరించుట.
వీనిలో ఏ యొక్క దానిని ఉల్లంఘించినా అతడు పాపి అవుతాడు. ఈ ఏడు మర్యాదలను పరిశీలిస్తే ప్రతి మర్యాద ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించి యుంది. చూడండి.
అహింస- ‘శరీరం, మాట, మనస్సు’ ఈ మూడింటికి చెంది యుంటుంది.
సత్యం - వాగింద్రియ సంబంధి.
అస్తేయం- శారీరక సంబంధి.
బ్రహ్మచర్యం- జననేంద్రియ సంబంధి.
శౌచం - సర్వేంద్రియ సంబంధి.
స్వాధ్యాయం- మనస్సు మరియు వాగింద్రియ సంబంధి.
ఈశ్వర ప్రణిధానం- మనస్సంబంధి.
ఈ మర్యాదలకు గల ఇంద్రియ సంబంధాన్నిబట్టి ఈ మర్యాదలను ఆచరించడం ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే అవుతుంది.
ఈ ఇంద్రియ నిగ్రహ ప్రాశస్త్యాన్ని మనుస్మృతికర్త మనువు ఈ విధంగా వివరించాడు.

- ఇంకాఉంది