స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక కవి యిలా అంటాడు.
అలబ్ధ శాణోత్కషణా నృపాణాం న జాతు వౌలౌ మణయో వసంతి॥
సానమీద బాగ రాపిడి జరిపి మెరుగుపెట్టబడకుంటే ఎంత ఘన రత్నమైన రాజుల కిరీటంలోగల మణులమధ్య చేరగలదా? కాబట్టి ఎంతటి ఉన్నత కుల సంజాతుడయినా, ఎంతటి మహావిద్వాంసులకు జన్మించినవాడయినా కర్మల ద్వారా నిపుణుడుగా తీర్చిదిద్దబడవలసినదే. ఈ విషయ బాహుళ్యాన్ని అంతా వేదమీవిధంగా హృదయంగమ శైలిలో ఇలా వివరించింది.
‘స మృజ్యతే కర్మభిర్దేనో దేవేభ్యః సుతః’ జ్ఞానులనుండి ‘జ్ఞానుల కొరకు పుట్టిన జ్ఞాని కర్మల ద్వారా పరిశుద్ధుడై మహాజ్ఞాని అవుతున్నాడు.’’
జ్ఞాని కావడానికి కాలవ్యవధి ఏమైనా ఉందా? అట్లే కర్మాచరణకు కాల పరిమితి ఉందా? అలా ఏమీలేదని జీవించినంతకాలమూ కర్మలను చేస్తూనే ఉండాలని యజుర్వేదం ఈ విధంగా శాసిస్తూంది.
కుర్వనే్నవేహ కర్మాణి జిజీవిషేచ్ఛత సమాః
ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే॥ (శు.య.వే.40-2)
ఆయువున్నంతకాలం మానవుడు కర్మలనాచరిస్తూనే నూరేండ్లు జీవించాలని కోరుకోవాలి. ఇలా జీవించేవానికి కర్మబంధనమంటదు. జీవనానికి ఇంతకు మించిన ఉపాయం లేదు.
ఈ విధంగా నిత్యకర్మశీలుడికి ఆత్మపరిశుద్ధమవుతుంది. దానివలన ఆత్మతేజం సమృద్ధమవుతుంది. యోగదర్శనంలో పతంజలి కూడ ఈ మాటనే ఇలా పేర్కొన్నాడు.
యోగాంగానుష్ఠానాద శుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః (యో.ద.2-28)
సర్వ యోగాంగాల అనుష్ఠానానంతరం చిత్తం పరిశుద్ధమై ప్రకృతి పురుషుల వివేకం హృదయంలో కలిగినంతనే జ్ఞానం పరిఢవిల్లుతుంది.

- ఇంకాఉంది