స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
తనను ఇతరులు హింసించాలని ఎవడూ కోరుకోడు. మరి తాను ఇతరులను హింసించేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు? ‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్’ ‘‘తనకు ప్రతికూలమైన వాటిని తా నితరులకు చేయరాదు’’అన్న భారత నీతి వచనానుసారం నడిచేవాడేకదా జ్ఞాని?
వేదవేత్తలు వ్యర్థంగా ఎన్నడూ హింసచేయరు. ఎందుకంటే ‘మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే’(శు.య.వే.36-18) ‘‘నేను సర్వప్రాణులను స్నేహదృష్టితో చూస్తున్నాను’అన్న శుక్ల యజుర్వేద వచనం వారికి బాగా ఎరుక కాబట్టి, మిత్రులుగా చూచే జీవులను ఎవడు హింసిస్తాడు? ఎవడో ఒకడు ఈ విధంగా జీవులను స్నేహంగా చూడటం కాదు. ‘మిత్రస్య చక్షుషా సమీక్షామహే’(శు.య.వే.36-18) ‘‘మాలో మేము మిత్రతాదృష్టితో చుచుకొంటున్నాం’అన్న ఉదాత్త్భావంతో బ్రతకండని వేదం హితవుచెబుతూంది. బుద్ధిభ్రష్టమైనవాడే హింసకు పాల్పడతాడు అని అథర్వణవేదం ఇలా చెబుతూంది.
‘యత్ర విజాయతే యమిన్యపర్తుః సా పశూన్ క్షితాతి రిఫతీ రుశతీ’ (అథ.3-28-1) ‘బుద్ధివైకల్యం చెందిన అవస్థలోనే వ్యక్తి ఆయుధాలతో చంపుతూ, అనేక ఇతరోపాయాలతో హింసిస్తూ పశుహత్య చేస్తాడు.’’
పశు- జంతుజాలాలలోగల హింసను చూచి హింస ప్రాకృతిక ధర్మమేనని ఎవడైనా చెప్పగలడా? అలా చెప్పినవారు తాము మనుష్యులమన్న విషయం మరచినవారే. పశు-జంతుజాతుల ననుసరించిన వాడిలో పెరిగేది పశుత్వమే. పశు- జంతు జాతులలో తమ సంతానాన్ని తామే తినే ప్రవృత్తిఉంది. ఆ పని మనిషి తాను చేసేందుకు సిద్ధంగా ఉండగలడా? లేకపోతే హింస ప్రాకృతిక ధర్మమని నిస్సారమైన మాట పలుకరాదు. వేదాలలో ‘పశూన్ పాహి’(శు.య.వే.1-1)అట్లే ‘మా హింసీ స్తన్వా ప్రజాః’ (శు.య.వే.12-32) అన్న హింసాధర్మ నిషేధమూ చెప్పబడింది. ఇట్టి అహింసా ధర్మప్రబోధకాలు హింసా నిషేధకాలు వేదాలలో పలు సందర్భాలలో బహుళంగా చెప్పబడ్డాయి. జ్ఞానిని యిలా ప్రవర్తించుమన్న ఈ మంత్రంలోని ప్రబోధం అహింసామార్గంలో నడిచే ప్రతి వ్యక్తి జ్ఞానియేనని వేద మంత్ర సారాంశం.
**
స మృజ్యతే సుకర్మభిర్దేవో దేవేభ్యః సుతః
విదే యదాసు సందదిర్మహీరపో వి గాహతే॥ ఋ.9-99-7॥
భావం:- విద్వాంసులలోనుండి విద్వాంసులకొఱకై పరిశుద్ధునిగా చేయబడిన విద్వాంసుడు సత్కర్మల ద్వారా పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడతాడు. ఈ సత్కర్మాచరణలో లభించిన ఉత్తమ దాత మహత్వంగల జలాలలో మునక వేస్తాడు.
వివరణ:- గొప్ప విద్వాంసులయిన తల్లిదండ్రులకు జన్మింపవచ్చు. ఉన్నత కుల సంజాతులైన తల్లిదండ్రులు పుట్టిన తమ బిడ్డను ఒక గొప్ప విద్వాంసుడిగా తీర్చిదిద్దాలని భావించవచ్చు. అందుకొఱకై ఆ బాలుని మహావిద్వాంసుల శిక్షణకొరకై పంపనూ వచ్చు. అంత మాత్రంచేత ఆ బాలుడు మహావిద్వాంసుడు కాగలడా?. దానిని సానరాయి మీద మెరుగుపెట్టనిదే అది ప్రకాశిస్తుందా?

- ఇంకాఉంది