స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ సందర్భంగా ఒక సందేహం కలుగవచ్చు. ఏమంటే దేశాన్ని అశాంతికి గురిచేసే దేశద్రోహులను శిక్షించమని అర్థించినంతమాత్రాన దేశభక్తుల కర్తవ్యం తీరిపోతుందా? వ్యక్తిగతంగా ఈ విషయంలో వారు చేసిందేముంది? అని. సాధారణంగా ప్రభువులు దేశద్రోహులకు కఠిన శిక్షలు విధించినా అతడు నియంత అని- దుష్పరిపాలకుడని నేరారోపణలు చేసి మరల దేశంలో మరో విధమైన అశాంతి రేపేవారుంటారు. అట్టివారిని ఆధునిక కాలంలో కూడ మనమంతా చూస్తున్నాం. అట్టివారు కూడ పరోక్ష విద్రోహులే. అట్టివారిని సమర్ధింపక ప్రభువుకు సమ్మతి తెలపడం కూడ దేశాభ్యుదయం దృష్ట్యా దేశభక్తియే. పరోక్ష విద్రోహులెందరున్నా ఇట్టివారి బలంతో రాజు మనోధైర్యంతో సుపరిపాలనను చేయగలడు. ఆ విధంగా ప్రభువునకు సమ్మతిని తెలుపుతూ సుపరిపాలనకు సహకరించేవారు నిజమైన దేశభక్తులు. అట్టివారి ఆకాంక్ష ఎలా ఉంటుందో క్రింది ఋగ్వేదమంత్రం యిలా తెలుపుతూంది.
స్వస్తిదా విశస్పతి వృత్రహా వి మృధో వశీ
వృషేంద్రః పుర ఏతు నః సోమపా అభయంకరః॥ (ఋ.10-152-2)
దేశాధిపతి స్వస్తిదా= కల్యాణకారకుడు. శాంతిప్రదాత. సుపరిపాలకుడు. పాపనాశకుడు, ప్రజాపీడిత నాశకుడు, దుర్జన నియంత్రకుడు, ప్రజాసుఖప్రదాత, ఐశ్వర్య రక్షకుడు, అభయంకరుడు, నిర్భయుడుగా ఉండిన పాలకుడు మాకు రాజు కావాలి.
పైన చెప్పబడిన పరోక్ష ద్రోహులధికంగా ఉన్న దేశంలో ఇట్టి ఆదర్శ సుపరిపాలకుడు ఎక్కడనుండి ఉద్భవిస్తాడు? కాబట్టి అట్టి విద్రోహులకు సహకరించక పోవడం కూడా నిజమైన దేశభక్తి. ప్రత్యక్ష విద్రోహులకంటే పరోక్ష విద్రోహులవలన దేశ స్వాతంత్య్రానికే భంగం కలిగే ప్రమాదముంది. అట్టివారిని బయట స్వేచ్ఛగా తిరుగకుండా కారాగారాలలో బంధించమని రాజును దేశభక్తులు ఇలా ప్రార్థిస్తున్నారు-
అధమం గమయా తమో యో అస్మాన్ అభిదాసతి.
‘మమ్ము బంధనాలలో (పారతంత్య్ర బంధనాలలో) పడద్రోసే వారిని అంధకారంలోనికి త్రోసివేయి’’. అంధకారంలోనికి అన్నమాట కారాగారానికి ప్రతీకయే. చీకటిలో ఉన్నవాడు వెలుగును చూడజాలని విధంగా కారాగారంలో బంధింపబడ్డవాడు అందరిలా సూర్యకాంతిని స్వేచ్ఛగా చూడలేదుకదా. అంటే చీకటిలో మ్రగ్గినట్లేకదా.
**
హింసను నిషేధించాలి.
ప్రేదగ్నే జ్యోతిష్మాన్ యాహి శివేభిరర్చ్భిష్ట్వమ్‌
బృహద్భిర్భానుభిర్భాసన్మా హింసీ స్తన్వా ప్రజాః॥ శు.య.వే 12-32॥
భావం:- ఓ విద్వాంసుడా! నీవు గొప్ప జ్ఞానప్రకాశం చేత ప్రకాశమానుడవై శోభస్కర కిరణాలతో విరాజిల్లుతూ మహావర్చస్సుతో మెరిసిపోతూ ఉత్తమగతులనే పొందుము. మరియు ప్రజలను శారీరకంగా హింసించవద్దు.
వివరణ:- జ్ఞాన ఫలమేమిటో అందరికి పూర్తిగా తెలుసు. ‘ఆత్మవత్ సర్వభూతేషు యః పశృతి స పశృతి’ సర్వజీవులను తనవంటి వారిగా భావించేవాడే జ్ఞాని. అట్టి జ్ఞాని
ఎవరిని హింసించగలడు?

- ఇంకాఉంది