స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నమై స్వప్రకాశాన్ని నలుదిక్కుల ప్రసారం చేయడమే బ్రహ్మయజ్ఞం. అంటే ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నతను ప్రసరింపచేయడమే బ్రహ్మయజ్ఞం.
ఆధ్యాత్మిక మార్గంలో పయనించే దశలో ఆత్మయందు దర్శనమై జ్యోతిర్మార్గంలో పయనించడం జ్యోతిర్యజ్ఞం.
ఆత్మకు దర్శనమైన జ్యోతిర్మార్గంలో నడుస్తూ పొందే ఆనందాన్ని తానే గాక ఇతరులచేత కూడ అనుభవింప చేయుటయే స్వర్యజ్ఞం. అసలు ఆనందానికి సాఫల్య సిద్ధియజ్ఞమే. అంటే యజ్ఞమే బ్రహ్మానందజనకం.
కొంచెం శ్రద్ధ వహించి పరిశీలిస్తే పరోపకారం, ప్రాణాయామం ఇంద్రియ నిగ్రహం, ఆత్మజ్ఞానం, పరమాత్మ బోధ మొదలైనవన్నీ యజ్ఞాలే. స్వాహా శబ్ద ఘోషణంతో చేయబడేది స్వార్థత్యాగమే. దానితో యజ్ఞం సంపన్నమై ఫలప్రదాయకమవుతుంది.
**
తగాదాలకోరును హీనంగా శిక్షించు
వి న ఇంద్ర మృధో జహి నీచా యచ్ఛ పృతన్యతః
అధమం గమయా తమో యో అస్మాన్ అభిదాసతి॥
అ.వే.1-21-2॥
భావం:- ఓ రాజా! మమ్ము పీడించేవారిని క్రూరంగా చంపు. తగాదాల మారి జనులను హీనంగా అణచివేయి. ఎవడు మాకు హాని కలిగించాలని భావిస్తాడో వాడిని కఠినంగా చీకటిలోనికి నెట్టివేయి. అంటే అతడిని సమాజంలో అనామకుడిగా చేయి.
వివరణ:- సమాజంలో సజ్జనులు మరియు దుర్జనులు అనే రెండు విధాలయిన వ్యక్తులూ ఉంటారు. దేశ హితం సుస్థిర శాంతి నెలకొనియున్నప్పుడే ఉంటుంది. అశాంతి ఉపద్రవాలు దేశంలో వ్యాపిస్తే దేశప్రగతి అన్ని రంగాలలో కుంటుపడుతుంది. ప్రాణాన్ని పణంగాపెట్టి అయినా దేశంలో శాంతిని రక్షించడం దేశభక్తుని కర్తవ్యం. కాని దేశద్రోహులను శిక్షించే అధికారం మాత్రం ఏ దేశభక్తుడికి ఉండదు కదా! అందుచేత ప్రభువుచేత అట్టివారిని శిక్షింపచేయాలి. అందుకే దేశభక్తులైన ప్రజలు దేశాధిపతికి వి న ఇంద్ర మృధో జహి ‘‘ఓ రాజా! మమ్ము పీడించేవారిని క్రూరంగా చంపు’’మని విన్నవించుకొన్నారు. న్యాయమేకదా. దేశాభివృద్ధిని కోరే దేశభక్తుల పాలిట దేశద్రోహులు పీడకులే కదా! అథర్వణ వేదంలో కూడ ఇట్టి ప్రార్థనే కనబడుతుంది. ‘వి రక్షో వి మృధో జహి వి వృత్రస్య హనూ రుజ’ (అథ.వే.1-21-3) ‘‘ప్రజాహింసకులను, రాక్షసులను, ప్రజాబాధకులను పట్టి దవడ పగులగొట్టు’’. అంటే అట్టివారికి కఠినాతి కఠినమైన దండనలను విధించి శిక్షించుమని అంతరార్థం.
దవడ పగులగొట్టుమని ఆదేశించిన అథర్వణవేదం తనివి తీరక మరల ఈ మంత్రంలో ‘నీచా యచ్ఛ పృతన్యతః’ ‘‘కలహాలమారి జనులను చాలా హీనంగా శిక్షించు’’మని మరోసారి ఆదేశించింది. అంటే దవడ పగులగొట్టడం వంటి మృదువైన శిక్షలు కూడ అట్టివారికి సరిపడవేమోనని వేద భావన.

- ఇంకాఉంది