స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమానం- నాభి స్థానంలో ఉండి పోషక రసాలను శరీరానికంతటకు వ్యాపింపచేసే వాయువు- సమానం
ఉదానం- కంఠగతంగా ఉండి ఆహార పదార్థాలను లోపలకు లాగే వాయువు- ఉదానం
వ్యానం- శరీరంలోని సమస్త అవయవాలలో వ్యాపించి వాని వాని క్రియలను నడిపించే వాయువు వ్యానం.
ఈ పంచవిధ ప్రాణ వాయువుల సమాహారమే ప్రాణమయ కోశమని చెప్పబడుతూంది. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా పరస్పర విరోధం లేక సమన్వయంతో శరీరంలో ఈ ప్రాణమయ కోశం నిర్వహించే సమష్టి క్రియాకలాపమే యజ్ఞం.
అనంతరం చక్షుః శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు కూడ యజ్ఞం చేతనే సాఫల్యం చెందాలని ఆకాంక్ష ప్రకటింపబడింది. అంటే పంచప్రాణాల వలె ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడ శరీరంలో సమన్వయంతో నిర్వహించే కార్యకలాపమంతా యజ్ఞమయమే నని భావం. సంధ్యామంత్రాలలో ఓం భువః... ఓం పునాతు నేత్రయోః మరియు ఓం చక్షుశ్చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రామ్ ఇత్యాది ఋషివాక్యాలను పరిశీలించండి. చక్షుః శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియాలు యజ్ఞమయమైనప్పుడే పవిత్రమవుతాయన్న భావం స్పష్టపడుతుంది.
తదుపరి వాక్కు అది పరిపూర్ణంగా భక్తివంతం కావాలని అభిలషింపబడింది. శాస్త్రాలలో ‘వాగ్ వా అగ్నిః’ (శతపథ బ్రహ్మ. 6-1-2-28) ‘‘వాక్కు అగ్నియే’’ అని చెప్పబడింది. అది నియంత్రణలో ఉన్నప్పుడే దేవపూజ, హితోపదేశం, పరోపకారాది సత్కార్యాలలో సఫలమై అమృత ఫలాలనిస్తుంది. నియంత్రణలో లేని వాక్కు అగ్నివలె వ్యక్తులనే కాదు మానవ సమాజానే్న సర్వనాశనం చేస్తుంది.ఈ సందర్భంలో మనస్సు జ్ఞానేంద్రియాలు- కర్మేంద్రియాలతో కూడి ఆత్మకు విధేయంగా ఆత్మకు చెందిన సర్వ కార్యకలాపాలకు సహకరించడమే మనో యజ్ఞం.
మరి ఆత్మ యజ్ఞానికి వస్తే పైన చెప్పబడిన ఆయువు, పంచప్రాణాలు, చక్షుః శ్రోత్రాది జ్ఞానేద్రియాలతో కూడి ఆత్మ తనకు తానుగా భగవదర్పితం కావడం ఆత్మ యజ్ఞం.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512