స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరి సంకల్పమొకటే అగుగాక!
సమానీ వ ఆకూతిః హృదయాని వః
సమానమస్తు వో మనో యథా వ. సునహాసతి ఋ.10-191-4॥
భావం:- మీ సంకల్పాలు, హృదయాలు, మనస్సులు ఒకే విధంగా ఉండుగాక! అందువలన మీ బలం, సహనశక్తి సర్వశ్రేష్ఠమై వర్థిల్లును గాక!
వివరణ:- ఋగ్వేదంలోని 10వ మండలం 191వ సూక్తంలో మనస్సులోని ఆలోచనలు, ఆలోచనలకనుగుణమైన మాటలు, మాటలకనుగుణమైన క్రియ కలాపాలు ఒకే విధంగా ఉండాలని ప్రధానంగా చెప్పబడ్డాయి. వానికి శాస్ర్తియమైన సాధనలు కూడ వివరించి చివరగా వానికి మూలమైన గుణాన్ని ‘సమానీ వః ఆకూతిః’ ‘‘మీ సంకల్పాలు ఒకటిగా ఉండాలి’’ అని సూత్రీకరించింది. ఎందుకంటే ‘కామస్తదగ్రే సమవర్తత మనసో రేతః ప్రథమం యదాసీత్’ (అథ.వే.19-52-1) కామమే సంకల్పానికి మొదటి విత్తు కాబట్టి. సంకల్పాలు ఒకటిగా అయితే హృదయాలు- మనస్సులు ఏకమై ఒకటిగా కలిసి యుంటాయి. అలా ఒకటి అయినప్పుడు అచటినుండి మహాశక్తి ఉద్భవిస్తుంది.
సంగచ్ఛ్ధ్వమ్; సమానోమంత్రః; సమానీ వ ఆకూతిః అనే మూడు మంత్రార్థాలను సమీక్షించితే క్రింది అంశాలు తెలియబడతాయి.
ఉత్తమ శక్తికొఱకు, 1. ఏకత్వ మత్యావశ్యకం. ఆ ఏకతకు 2.ఒకే ప్రవర్తన- ఒకే ఆచరణలు అనివార్యం. ఆచరణలలో ఐక్యత సిద్ధించాలంటే 3.మాట ఒకటిగా ఉండాలి. మాట ఒకటిగా ఉండాలంటే 4. ఆలోచనారీతి ఐక్యంకావాలి. అలా కావడానికి 5. విచారణా విషయం మరియు 6. విచారణచేసే వేదిక ఒకటిగా నిలవాలి. దానికి మనస్సు మరియు చిత్తము సమీకృతమై ఒకే లక్ష్యసాధనకు సిద్ధపడాలి.
7. భోగ సామగ్రి భిన్నంగా ఉంటే ఎంతటి గొప్ప లక్ష్యమైన భిన్నమైపోతుంది. కాబట్టి 8. భోగ సామగ్రి అందరికి సమానరీతిగా ఉండాలి. ఈ అన్నింటితోబాటు దైవారాధనా విధానం, దైవగ్రంథాలు భిన్నంగాకాక 9.ఒకే దైవ ప్రతిపాదనాత్మకమైన గ్రంథాలుగా ఉండుట సముచితం. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘‘అందరి మనస్సులలోని సంకల్పం ఒకటికావడం అత్యంత ప్రధానం. ఈ విధంగా జనించిన శక్తి అజేయమై నిలుస్తుంది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు