స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ మనస్సులు, జ్ఞానుల మనస్సులు సమానమై ఉండుగాక’’అని దీని అర్థం. ఆ విధంగా మన మనస్సులు ఎప్పుడు కాగలవు? అంటే-జ్ఞానులు ఏమిచేస్తారో దానినే నోటితో వచిస్తారు. వచించిన దానినే మనస్సులో సంకల్పిస్తారు. ఆ విధంగా మనమూ ఆచరిస్తే మన మనస్సులు జ్ఞానుల మనస్సులతో సంవదిస్తాయి అంటే సమానమవుతాయి. అలా జ్ఞానులవలె మనసా, వాచా, కర్మణా ప్రవర్తిస్తే సంకల్పించిన లక్ష్యాలు ఫలవంతమై ఐశ్వర్య ప్రదాయకమవుతాయి.
ఈ ఋగ్వేదం దైవోపదేశాలనే ఈషద్వేదంతో అథర్వణవేద మీ విధంగా వచించింది.
‘సం జానీధ్వం సం పృచ్యధ్యం సం వో మనాంసి జానతామ్’ (అథ.వే.6-64-1)
ఒకే విధంగా ప్రవర్తించండి. ఒకరితో ఒకరు కలసి జీవించండి. మీ మనస్సు జ్ఞానుల మనస్సుతో ఏకీభవింపచేయండి.’’
ఋగ్వేదంలోని ‘సంవదధ్వమ్’అథర్వణ వేదంలోని ‘సంపృచ్యధ్వమ్’ సమానార్థకాలే. ఋగ్వేదం చెప్పిన ‘‘కలిసిమెలసి నడవండి- కలిసి పలకండి’’ అన్న విషయానే్న ‘సంవదధ్వమ్’అని చెప్పిన దానిని ఎలా ఆచరించాలో ఈ అథర్వణవేద మంత్రం ‘‘మీరంతా ఒకరితోఒకరు కలిసి ఐకమత్యంలో నడవండి’’అని విశేషంగా ప్రతిపాదించింది. దీనివలన జ్ఞానులలో మనసా- వాచా- కర్మణా సమానంగా ఉండే సద్బుద్ధి మీలోకూడా జనిస్తుందని ప్రయోజనాన్ని తెలిపింది. ఋగ్వేదం సాధ్య విషయాన్ని అథర్వణవేదం సాధనావిషయాన్ని శాస్త్ర దృష్ట్యా చెప్పాయని చెప్పవచ్చుగాని మనసా వాచా కర్మణా అందరూ ఒకే ఆలోచన గలిగి కలిసిమెలసి నడవండి. ఒకే మాట పలకండి అన్న వేదోభయ సందేశం మానవ జాతికి మాత్రం శిరోధార్యం.
ఒకే వేదిక- ఒకే ఆలోచన
సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషామ్‌
సమానం మంత్రమభి మంత్రయే వః సమానేన వో హవిషా జుహోమి॥॥
భావం:- భగవానుడు మానవులకిలా ఆదేశిస్తున్నాడు. మీ మనస్సులలోని ఆలోచనలు లేదా ఆరాధనామంత్రాలు అంటే ఆరాధనారీతులు సమానంగా ఉండుగాక.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512