స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహిరంగంగా ఘనమైన ధనాగారమంటే మేఘ రూపమైన జలనిధి అని మేఘపరంగా ప్రార్థన అయితే ఘన= అక్షయమైనది కావడంవలన ఘనమైన ధనాగారం= ధననిధిని తెరిచి అర్థార్థులకు వర్షించి వారి ధనార్తిని తీర్చుమని పరమాత్మపరంగా రెండవ యర్థమిచ్చట శోభిస్తూంది.
భక్తులకు సహజంగా ఐహిక వాంఛలుండవు. ఉన్నవాడు భగవద్భక్తుడు కాలేడు. వారి కోరికలన్ని లోకశ్రేయస్సు కొఱకే. వేదమీ సత్యాన్ని ‘ఘృతేన ద్యావాపృథివీ వ్యుంధి’ ‘‘ఘృతేన= నీటితో నింగి నేలలను బాగా తడుపుము’’అన్న భక్తుని వచనం ద్వారా ఆవిష్కరించింది. ఈ భావనే్న మరో ఋగ్వేద మంత్రం మరింత విపులంగా వర్ణించింది.
ఇదం వచః పర్ణన్యాయ స్వరాజేహృదో అస్త్వంతరం తజ్జుజోషత్‌
మయో భువో వృష్టయః సంత్వస్మే సుసిష్పిలా ఓషథీర్దేవ గోపాః॥ ॥
నీ దృష్టులు మరియు వానివలన వర్ధిల్లే ఓషధులు మాకు సుఖదాయకం కావాలని మా హృదయాభిలాష. మేఘం జీవులకు జీవనదాయిని అయిన జలాన్ని వర్షించి దివ్య ఓషధులను ప్రదానం చేయవచ్చు. కాని వర్షించే నల్లని మేఘం హృదయంలోని ఎవరి మాటనైనా వింటుందా? దైవంవలె స్వయంగా ప్రకాశింపగలదా? ఏదీ చేయలేదు. ఎందుకంటే అది అచేతనం. హృదయంలో మాటను వినగలిగిన శక్తిగలది ఒక్క ధర్మమనే మేఘమే. అంటే ధర్మస్వరూపుడైన దైవమే. అదే భక్తులకు సమస్తాన్ని వర్షించగలదు. అట్టి ధర్మస్వరూపమైన దైవమేఘాన్ని గురించి భక్తుని ప్రార్థనను ఋగ్వేద మీ విధంగా వర్ణించింది.
అజీజన ఓషధీర్భోజనాయ కముత ప్రజాభ్యో- విదో మనీషామ్‌॥ ॥
‘నీవు భోజనార్థంగా ఓషధులను, శాక, పాకాదులను ఉత్పాదనచేసి జీవులకు జ్ఞానం మరియు బుద్ధిశక్తుల ననుగ్రహిస్తున్నావు’’ అచేతనమయిన సామాన్యమేఘం జీవులకు జ్ఞానం మరియు బుద్ధి శక్తులను ఈయగలదా? ఈయగలిగేది ఒక్క ధర్మస్వరూపుడైన భగవనే్మఘమే. ఆ మేఘాన్ని ఈ మంత్రంలో నీ జలనిధిని తెరువుము. మీ జ్ఞాన బుద్ధిశక్తులను తడుపుమని భక్తుడు ప్రార్థించాడు.
**

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు