అంతర్జాతీయం

ప్రపంచ దేశాల ముందు దోషిగా పాక్‌ : ఓ‌ఐసీలో సుష్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్‌: తీవ్రవాదానికి ఎలాంటి మతం, కులం లేదన్నారు. ప్రపంచ దేశాల ముందు పాక్‌ దోషిగా తేలిందని, ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ బెదరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇస్లామిక్ సహకార సంస్థ(ఓ‌ఐసీ) సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. పుల్వామాలో జరిగిన ఘటనను ఓ‌ఐసీలో ఆమె ప్రస్తావించారు. నేను గాంధీ పుట్టిన నేల నుంచి వచ్చాను. మా దేశంలోని ప్రతి మంత్రం శాంతితోనే ముగుస్తుందని అన్నారు. భారతదేశంలో ముస్లింలు, హిందువులు కలిసిమెలిసి జీవిస్తున్నారని, ఎవరో కొద్దిమంది మాత్రమే అతివాద సిద్ధాంతలకు ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే కృషికి భారత్ మద్దతు ఇస్తుందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా పోరాడాలని, తీవ్రవాదం పేరుతో మతాన్ని వక్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. కాగా ఓఐసీకి భారత్‌ను ఆహ్వానించడంతో పాకిస్తాన్ ఈ సమావేశానికి గైర్హాజరయింది.