జాతీయ వార్తలు

జామియా ఆందోళనలపై రేపు సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్శిటీలో చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన కేసుపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరుగనున్నది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు యూనివర్శిటీలో నిన్న జరిగిన అల్లర్లకు సంబంధించిన విషయంపై సుమోటోగా స్వీకరించాలనిప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీం కోర్టును కోరారు. ఇది పూర్తి్స్థాయిలో మానవహక్కుల ఉల్లంఘనే అని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ‘హక్కులను మేము గౌరవిస్తాము.. కానీ అల్లర్ల విషయంలో కాదు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత దీన్ని సుమోటోగా విచారిస్తామని అన్నారు. ఈ కేసు గురించి బోబ్డే నేతృత్వంలో రేపు సుప్రీంలో విచారణ జరుగనుంది.