జాతీయ వార్తలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను విస్మరిస్తూ ఈ కేసులో నిందితులను ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్‌కౌంటర్ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బోబ్డే స్పందిస్తూ హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నామని స్పష్టంచేశారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై మీరేమనుకుంటున్నారో సలహాలు, సూచనలతో రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర తరపున న్యాయవాదికి జస్టిస్ బోబ్డే ఆదేశించారు. కాగా తెలంగాణ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ ప్రభుత్వ తరపున వాదనలు విన్న తరువాతే ముందుకు వెళ్లాలని ధర్మాసనాన్ని కోరారు.