జాతీయ వార్తలు

ఆగస్టు 2నుంచి అయోధ్యపై తుది విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆగస్టు 2వ తేదీ నుంచి అయోధ్యపై సుప్రీం కోర్టు ధర్మాసనం తుది విచారణ జరుపనున్నది. అప్పటి వరకు మధ్యవర్తిత్వమే కొనసాగుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పు వెల్లడించింది. జూలై 31వరకు మధ్యవర్తిత్వ కమిటీ కొనసాగాలని, దీనికి సంబంధించిన తుది నివేదికను ఆగస్టు ఒకటిన సమర్పించాలని, ఆగస్టు 2వ తేదీ నుంచి తుది విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదంపై సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.