బిజినెస్

సరఫరా లోపాలతోనే అధిక ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిన టమోటా ధరలపై ఆహార మంత్రి పాశ్వాన్
దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం
టమోటా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఉందని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 23: రిటైల్ మార్కెట్‌లో కిలో టమోటా ధర 60 రూపాయలు దాటిపోయిన నేపథ్యంలో ధరల పెరుగుదలకు కారణం సరఫరా లోపాలే తప్ప ఉత్పత్తి తగ్గిపోవడమేమీ కాదని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమోటా సరఫరా మార్కెట్‌లోకి డిమాండ్‌కు తగ్గట్లుగా జరగడం లేదని, దీంతో ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ‘దేశంలో టమోటా ఉత్పత్తి తగ్గలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాల కారణంగా అక్కడి నుంచి టమోటా సరఫరాకు సమస్యలేర్పడ్డాయి. దీనివల్లే ధరలు పెరిగాయి.’ అని సోమవారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు ఇంకా కొండెక్కిన పప్పు ధరలు దిగిరాకపోవడంపై స్పందించిన ఆయన దీనికి డిమాండ్-సప్లై లోపమేనన్నారు. అలాగే అక్రమ పప్పు్ధన్యాల నిల్వలపైనా దాడులు జరుపుతున్నామని, విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని చెప్పారు.
మార్చిలో ఆహార భద్రతా చట్టం
వచ్చే ఏడాది మార్చి నాటికి తమిళనాడు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రతా చట్టం అమల్లోకి వస్తుందని పాశ్వాన్ అన్నారు. ఇప్పటిదాకా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్నాయని, మరో 14 ఈ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. 2013లో పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించగా, దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది సమయాన్ని తీసుకున్నాయి. ఇప్పటిదాకా ఇలా మూడుసార్లు జరగగా, ఈ సెప్టెంబర్‌తో గడువు ముగిసిపోయింది. కాగా, నెలనెలా ప్రతి వ్యక్తి 5 కేజీల ఆహార పదార్థాలను సబ్సిడీలో పొందేలా ఆహార భద్రత చట్టం హక్కునిస్తుంది.