రాష్ట్రీయం

ధరల అదుపునకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండలిలో మంత్రి సునీత వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపుచేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండలిలో విపక్షాలు మండిపడ్డాయి. రేషన్ షాపుల ద్వారా పేదలకు అందజేస్తున్న బియ్యం, పప్పులు వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని, అధికారుల నియంత్రణ ఏమాత్రం లేకుండా పోయిందని ఆరోపించారు. ఏపి శాసన మండలి శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల పర్వం కొనసాగింది.
ధరల పర్యవేక్షణ, వినియోగదారుల సేవలపై పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వివరణ ఇచ్చారు. ప్రజల అవసరాల మేరకు కందిపప్పు ఉత్పత్తి, వినియోగం మధ్య అంతరం ఉన్నందున పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి బిపిఎల్ కుటుంబాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అమె చెప్పారు. రాష్ట్రంలో 2.87 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా ఉత్పత్తి 57వేల మెట్రిక్ టన్నులు ఉందన్నారు. దీంతో 2.30లక్షల ఎంటిఎం లోటు ఉందని మంత్రి వివరించారు.
బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని, సరుకులను వెలికి తీయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. వ్యాపారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆస్తులు జప్తుచేసినట్టు సునీత వెల్లడించారు. అంతకు ముందు కాల్‌మనీపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 227 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు. హంద్రీ-నివా కాలువ, పెద్దగడ్డ ప్రాజెక్ట్, ఐటిడిఏ పాఠశాలల్లో పినచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు జీతాలు, నెల్లూరులోని కిసాన్‌సెజ్‌పై జరిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమమహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, కాల్‌మనీ అంశంపై జరిగిన చర్చ తరువాత మండలి చైర్మన్ చక్రపాణి సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.