AADIVAVRAM - Others

తోట ( సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ మంచిని తలచుకో, తథాస్తు దేవతలు ఉంటారని మన పెద్దవాళ్లు ఎందుకు చెప్పారో తెలీదుగానీ, ఇదే మాట ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు చెబుతున్నారు. చెడు భావనలు ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. సంతోషం లేకుండా పోతుంది. అందుకని మంచి భావనలు ఉండాలి. మంచిని తలచుకోవాలి. వ్యతిరేక భావనలు రాకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ఈ మధ్య ఓ పుస్తకంలో చదివాను. మనిషి మనస్సు ఓ తోట లాంటిదని. అది నిజమేనని అన్పిస్తుంది. తోటలో మంచి మొక్కలు, మంచి చెట్లు, పండ్లు, పూలు ఎన్నో ఉంటాయి. అవి ఉండాలంటే వాటిని నాటాలి. పాడు కాకుండా చూసుకోవాలి. పెంచి పోషించాలి. మంచి మొక్కలు నాటి పెంచి పోషించకపోతే అక్కడ అంతా గడ్డి గాదం, పిచ్చి మొక్కలు పెరుగుతాయి. వాటిని ఉద్దేశపూర్వకంగా తీసివేయడం ఎంత ముఖ్యమో మంచి మొక్కలని, చెట్లని పెంచి పోషించడం అంతే ముఖ్యం. అప్పుడే ఆ తోటకి అందం వస్తుంది. మనకు ఆనందం లభిస్తుంది.
మన మనస్సు కూడా తోట లాంటిదే. అందులో
ఎప్పుడూ మంచి ఆలోచనలు రానివ్వాలి.
ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే చెడు ఆలోచనలు మొలుస్తూ ఉంటాయి. చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే మంచి ఆలోచనలని పెంచి పోషిస్తూ ఉండాలి.
మన మనస్సుకు మనం తోటమాలిలా వ్యవహరించాలి. మంచి మొక్కలని చెట్లని నాటడమే కాదు. వాటిని పెంచి పోషిస్తాడు అతను. పిచ్చి మొక్కలని తీసివేస్తాడు.
మన మనసు తోటలాంటిదే.
మంచి ఆలోచలని పెంచి పోషించాలి. చెడు ఆలోచనలు వాటంతట అవే తొలగిపోతాయి. మంచి ఆలోచనలని మన మనస్సులో నాటకపోతే చెడు ఆలోచనలతో నిండిపోతుంది. అది అసంతృప్తిని, అనారోగ్యానికి దారి తీస్తుంది.
మంచి ఆలోచనలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి.