AADIVAVRAM - Others

ఒకటే కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో వర్షాకాలం పడవలై పరుగెత్తేది. ఉరుము ఉరిమినప్పుడల్లా అర్జునా అని, ఫల్గుణా అని తలుచుకునేవాళ్లం. ఆకాశం కారుమబ్బులు కమ్మి భయపెట్టినప్పుడు ఆంజనేయ దండకం చదువుకునేవాళ్లం. బాగా వాన పడితే బడి ఉండకపోయేది. వర్షం పడి మట్టి పరిమళాలను వీచేది. ‘ఆరుద్ర’ పురుగులు ఇంటి గోడల మీద దర్శనం ఇచ్చేవి. చెరువులు నిండి భయపెట్టేవి. వాగులు పొంగి పొర్లి ప్రయాణాలకు ఆటంకం కలిగించేవి. సిమెంట్ రోడ్లు, తార్రోడ్లు అప్పుడు అంతగా ఉండేవి కావు. అందుకని రోడ్లు బురదతో వుండేవి. ముసురు వాన వున్నప్పుడల్లా ఇదే పరిస్థితి ఉండేది. ముసురు పడినప్పుడల్లా చీదరగా వుండేది.
ఈ చీదరను వాన ఎలా కనిపెట్టేదో ఏమో మాయమై పొయ్యేది. తరువాత చలికాలం వణుకుతూ వచ్చేది. అడుగున పడిపోయిన బ్లాంకెట్లకి ప్రాణం పోసేది. చలికి ఒళ్లు పగిలిపొయ్యేది. చలి ఉదయం కష్టపెట్టేది. చదువుకోవడానికి పెద్దవాళ్లు లేపితే వాళ్ల మీద విపరీతమైన కోపం వచ్చేది. రాత్రిపూట త్వరగా నిద్ర వచ్చేది. ఓ రెండు రోజులు వాసిలైన్లు పెట్టుకోకపోతే శరీరం పగిలేది. చలికాలం మీద విసుగు వచ్చేది. మా విసుగుని ఎలా కనిపెట్టేదేమో కాని వెంటనే చలికాలం పరిగెట్టి కన్పించకుండా పోయేది.
ఎండాకాలం మెల్లిగా వచ్చేది. చల్లని గాలిలా కూజాలోని నీళ్లలా వచ్చేది. మామిడిపళ్లు, మల్లెలు, మలయానిలాలు గంతులేసేవి. పరీక్షలు, ఫలితాలు, స్నేహితులు, ఆటలు అద్భుతంగా సాగేది.
ఎండాకాలానికి కూడా కోపం వచ్చేది. ఒక్కోసారి మండిపోయేది. మండిపోతూ మమ్మల్ని అడుగు బయట పెట్టనివ్వకపొయ్యేది. చెమట కాయలతో మమ్మల్ని చంపేసేది. మామిడికాయ పచ్చడితో ఆనందపరిచేది కూడా.
మండె ఎండలతో చస్తున్నామన్న మా మాటలు విని ఎండాకాలం కూడా అదృశ్యమై పోయేది. ఆ తరువాత మళ్లీ వానాకాలం, చలికాలం, ఎండాకాలం. నిరంతరం ఈ క్రమం కొనసాగేది.
కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎంత విసుక్కున్నా ఒకటే కాలం. నిత్యం అనునిత్యం అదే కాలం. ఎంత తిట్టినా, విసుక్కున్నా ఒకటే కాలం అదే ఎండాకాలం. కాకపోతే ఏప్రిల్, మే, జూన్‌లతో కోపంతో రగిలిపోయే సూర్యుడు.
ఇప్పుడు ఇదేం కాలమో
ఎప్పుడూ ఒకటే కాలం
నీళ్లులేని కన్నీళ్లు తెప్పించే
ఎండాకాలం.