Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతానికి సుక్కూతోనే...

- దర్శకుడు సూర్యప్రతాప్

కరెంట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తాజాగా కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు పల్నాటి సూర్యప్రతాప్. ఈ సందర్భంగా సూర్యప్రతాప్‌తో చిట్‌చాట్...

కరెంట్ తరువాత ఇంత గ్యాప్పా?
కరెంట్ సినిమా తరువాత నిజంగానే గ్యాప్ వచ్చింది. సుకుమార్ దగ్గర ఆర్యకు అసిస్టెంట్‌గా పనిచేశాను. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అక్కడే ఆఫర్ రావడంతో వేరే సినిమావైపు చూడలేదు.

దర్శకత్వం తరువాత రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లోనా?
రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అనుభవం తక్కువ. సుకుమార్ స్టైల్‌ను ఎవరూ టచ్ చేయలేరు. అలాంటి ఆయన స్కిల్‌ని నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే చేరా.

మరీ ఇంత బోల్డుగా కథ చెప్పారు?
ఇది బోల్డు కానె్సప్టే కానీ ఎక్కడా మరోకోణం కనిపించదు. ఈరోజుల్లో ఉన్న జనరేషన్‌లోని అబ్బాయి అమ్మాయి కథే ఈ సినిమా.

కుమారికి రెస్పాన్స్ ఎలా వుంది?
నిజంగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. సినిమా చూసిన చాలామంది బాగా తీశానని అభినందిస్తున్నారు.

మరి తదుపరి చిత్రాలు?
ఇప్పటికైతే సుకుమార్‌తోనే జర్నీ ఉంటుంది. ఆయన మరేదైనా కథ చెబితే అపుడు చేస్తానేమో చూడాలి.

-శ్రీ