తెలంగాణ

ఆరుగురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్/నల్లగొండ/మెదక్, డిసెంబర్ 3: సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండల కేంద్రానికి చెందిన నామాల లక్ష్మినారాయణ (51) అనే రైతు తన వ్యవసాయ పొలం దగ్గర పురుగుల మందు సేవించి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేసిన అప్పులతో పాటు చిన్న కూతురు పెళ్ళి కూడా సిద్దంగా ఉండడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా దేవరకద్ర మండల పరిధిలోని పెద్దరాజమూరు గ్రామంలో వెంకటరాములు (35) అనే రైతు పంట నష్టం వాటిల్లిందని తన వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులను అతనిని గురువారం గుర్తించారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామానికి చెందిన బానోతు లింగయ్య (45) అనే రైతు గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా ఇదే జిల్లాలోని సంగారెడ్డి మండలం ఉత్తర్‌పల్లిలో అప్పుల బాధ భరించలేక గొల్ల సుబుద్ది (52) అనే రైతు బుధవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నల్లగొండ జిల్లా డిండి మండలంలో ఇద్దరు పత్తి రైతులు పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు.
ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల్లో ఒక మహిళా రైతు కూడా ఉంది. చెర్కుపల్లి గ్రామానికి చెందిన కొమిరె అమృతమ్మ (40) అమృతమ్మ బుధవారం రాత్రి వ్యవసాయబాయి వద్దకు వెళ్ళి పురుగుల మందు సేవించింది. గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను గ్రామంలోకి తీసుకొచ్చే లోపు అమృతమ్మ మరణించింది. ఖానాపురం గ్రామపంచాయతీ పరిధిలోని జ్యోత్యతండాకు చెందిన లావుడియా శ్రీను (36) బుధవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్ళి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.