ఐడియా

చింతలను దూరంచేసే శాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కోపం ఎల్లప్పుడూ క్షేమం కాదు’’ అన్నది విజ్ఞుల బోధ. ‘‘కోపమే శత్రువు, శాంతమే రక్ష’’ అన్నది శతకకారుల మాట. అయితే క్షమాగుణం కూడా ఎల్లప్పుడూ మంచిది కాదు. ఒక్కో సందర్భంలో దారి తప్పిన మనిషిని సద్వర్తనున్ని చేయడానికి అనునయ వాక్యాలు ఉపయోగపడతాయి. ఒక్కొక్కప్పుడు దండనం కూడా ఫలితాలనిస్తుంది. ‘‘దండనం దశగుణం భవే’’ కదా! నిత్యం క్షమాగుణాన్ని ఆశ్రయించి శాంతంతో దుర్జనుల్ని, హింసామార్గంలో సమాజానికి చేటుచేసేవాళ్ళని, సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించడం నూటికి నూరు శాతం తప్పే. అయిదు సంవత్సరాల వరకు పిల్లల్ని లాలిస్తూ ఉండాలని, పదిహేను సంవత్సరాల ప్రాయం వచ్చేవరకు ప్రేమను మనస్సులోనే దాచుకొని వాళ్ళలో భయభక్తుల్ని పెంచడానికి దండించాలని, పదిహేను సంవత్సరాలు దాటిన పిదప పిల్లలను తల్లిదండ్రులు స్నేహితుల్లా చూడాలని శాస్త్ర నియమం. ఈ ప్రబోధంలో ఇమిడివున్న లాలన, పాలన, దండన.. పిల్లలను పెంచడంలో ప్రయోగించాలని వివరణ. దండనలో కోపం, లాలనలో ప్రేమా, వాత్సల్యం, పాలనలో యుక్తి, బోధనా ఇమిడి వున్నాయి. పిల్లలు తప్పు చేయగానే తల్లిదండ్రులు కోపంతో దండిస్తారు. ఆ తల్లిదండ్రులే దండనతో ఏడ్చే పిల్లలను విచిత్రంగా అక్కున చేర్చుకొని ఓదార్చడం మనం గమనిస్తూ ఉంటాం. చేసిన తప్పుకి దండిస్తారు. మరలా తప్పు చెయ్యొద్దని ప్రేమతో వాత్సల్యంతో హెచ్చరిస్తారు. ఇటువంటి సందర్భాల్లో కోపాన్ని, క్షమాగుణాన్ని తల్లిదండ్రులు సమపాళ్ళలో ప్రయోగిస్తారు. తల్లిదండ్రులు దండిస్తారన్న భయంతోగాని, వాత్సల్యంతో కూడిన అనునయ వాక్యాల ప్రభావానికిగాని ఎక్కువ మంది పిల్లలు ఆ తప్పును మరలా చేయకుండా వుంటారు. క్రమశిక్షణను పెంచడానికి కోపాన్ని, శాంత, క్షమాగుణాల్ని సమతౌల్యంగా వినియోగించడం జీవితంలో యుక్తి. అధికారులు కార్యనిర్వహణలో కింద పనిచేసే సిబ్బందిని నియంత్రించడానికి కోపాన్ని ప్రదర్శిస్తారు. చిన్న చిన్న తప్పుల విషయాల్లో క్షమాగుణంతో కూడా వ్యవహరిస్తారు. బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నపుడు పదే పదే తప్పులు చేస్తున్న కింది స్థాయి ఉద్యోగిపై అధికారులు ఆగ్రహం ప్రదర్శిస్తారు. ముందు సహజ ధోరణిలో హెచ్చరించి తప్పులు చేయవద్దని సున్నితంగా హితవు పలుకుతారు. రెండవసారి తప్పు మళ్లీ చేస్తే కోపంతో గట్టిగా హెచ్చరిస్తారు. అప్పటికీ తప్పు సరిదిద్దుకోని పక్షంలో ఆ ఉద్యోగిలో పరివర్తన తేవడానికి అతనిని శిక్షిస్తారు. ఇది శిక్షాస్మృతి చెప్పే విధానం. శిక్షను అమలు చేసిన తర్వాత ఉద్యోగి ఉన్నతాధికారిని అభ్యర్థిస్తే క్షమించడం, శిక్షను తగ్గించడం కూడా జరుగుతుంది. క్రమశిక్షణను పెంచడానికి, విధి నిర్వహణలో అలక్ష్యాన్ని లేకుండా చేయడానికి ఆగ్రహవేశాలు ఉపకరిస్తే, శిక్ష ద్వారా ఉద్యోగుల్లో మార్పు తెప్పించాలని అధికారులు ప్రయత్నిస్తారు. విధించిన శిక్ష ద్వారా ఉద్యోగికి నష్టం వాటిల్లకుండా నడవడిని మార్చుకున్న ఉద్యోగులకు క్షమాగుణం ఉపకరిస్తుంది.
వివాద పరిష్కార సమయంలో ఇద్దరు వ్యక్తులమధ్య, రెండు వర్గాలమధ్య సంధియత్నాలు చేసేటపుడు కటువుగా వ్యవహరించేటపుడు ఆగ్రహంతోను, ఒప్పించాలనుకునేటప్పుడు క్షమతో కూడిన శాంత వచనాల ద్వారా వివాదాన్ని పరిష్కరించడం, ఇరువర్గాలను రాజీ చేయడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో కేవలం కోపం, ఆవేశంతోగాని అలాగని కేవలం శాంత వచనాలతో కూడిన క్షమాగుణంతో గాని సంఘర్షణను నివారించలేం, సమస్యను పరిష్కరించలేం. కోపాన్నిగాని, క్షమనుగాని సమయోచితంగా ఉపయోగించేవారే యుక్తిపరులు, వివేకవంతులు.

Raj kumar