సబ్ ఫీచర్

ఎంపీ లాడ్ పథకం అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్) కేంద్ర ప్రభుత్వంచే 1993 డిసెంబర్ 23న ప్రవేశపెట్టబడింది. అప్పుడు ప్రతి ఎంపీకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. దీన్ని 1994లో కోటి రూపాయలకు, 1998లో 2 కోట్ల రూపాయలకు, 2011లో ఐదు కోట్ల రూపాయలకు పెంచుతూ వచ్చారు. 1993-94లో ఈ పథకానికి కేటాయింపు రూ.37.80 కోట్లు వుంటే, ప్రస్తుతం అది రూ.4,000 కోట్లకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలుపరచే ఈ పథకం పార్లమెంట్ సభ్యుల సలహాతో వౌలిక సౌకర్యాలు, మనుగడల ఆస్తులను కల్పించవలసి వుంది. జిల్లా కలెక్టర్ నోడల్ అధికారి, పనుల అమలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఏ) చేపడుతుంది. ఎంపీ లాడ్స్ అమలులోని అనేక అవకతవకలను, 2005 మార్చి 23న విడుదలైన తన నివేదికలో ఎరా సెజియాన్ పేర్కొన్నా రు. ఈ పథకంపై అనేక ఇతర అధ్యయనాలు, ఆడిట్ రిపోర్టులు కూడా వున్నాయి. కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా ఈ పథకాన్ని వ్యతిరేకించారు.
మొదటి నుండి ఎంపీ లాడ్స్ అనేక ఆరోపణలను ఎదుర్కొంటూనే వుంది. అనుకున్న సమయంలో పనులు చేపట్టడం జరగలేదు. చెల్లింపులలో అవకతవకలు, నిధులను దారిమళ్లించడం, కొందరి విషయంలో నిధులను నాలుగు సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా వేసుకోవడం జరిగాయి. వాస్తవంగా నిధులను, పనులు సకాలంలో చేపట్టడానికి వీలుగా, ఎస్.బి. అకౌంట్‌లో వుంచాలి.
పనుల అమలులో తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. కొన్ని పనులు అసంపూర్తిగా వున్నాయి. కొన్నిటిని ప్రారంభించడంలోనే జాప్యం. పనుల అమలులో కొన్ని సమస్యలు (ఉదాహరణకు, భూసేకరణ) వున్నాయంటున్నారు జిల్లా అధికారులు. కొన్ని అనుమతులు లేని పనులు కూడా చేపట్టడం జరిగింది. కొందరు కేటాయించిన మొత్తాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. కాంట్రాక్టర్లను నియమించడంలో కొన్ని అవకతవకలు జరిగాయి. కొన్ని పనులలో నాణ్యత కొరవడింది. ఎంపీలాడ్స్ నిధులతో ఏర్పరచిన కొన్ని ఆస్తులు కనిపించడం లేదు!
ప్రభుత్వం పథకం అమలులో లోపాలను తీవ్రంగా పరిగణిస్తున్నది. అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే పనిలో వుంది ప్రభుత్వం. దుర్వినియోగమైన మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి వడ్డీతో సహా తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, నిధుల వినియోగ తీరుపై పర్యవేక్షణ స్వతంత్ర సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఎంపీకి కేటాయించే రూ.5 కోట్లను రూ.25 కోట్లకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
2014లో సవరించిన నిబంధనల ప్రకారం ఎంపీ లాడ్స్ తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ పనులు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంపీలాడ్స్ నిధులను సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనకు వినియోగించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఒక ముఖ్య విషయం. రాజ్యాంగ 73వ 74వ సవరణల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక స్థాయిలో స్థానిక సంస్థలకు (గ్రామాలలో పంచాయతీలకు, పట్టణాలలో మున్సిపాలిటీలకు) అప్పగించాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు గల సంస్థలే అమలుపరచాలని ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాలు ఈ దిశగా తగిన కృషిచేయటం లేదు. ఉదాహరణకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఏ) ఇంకా కొనసాగుతూనే వుంది. వాస్తవంగా దీని విధులు జిల్లా పరిషత్‌కు అప్పగించాలి. ఎంపీ లాడ్స్‌ను పూర్తిగా రద్దుచేయవచ్చు లేదా తగు మార్పులు తేవచ్చు. సాధారణంగా పనులను ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయాలి. సామాజిక తనిఖీ కూడా ముఖ్యం. బహు కొద్దిమంది ఎంపీలే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నది వాస్తవం.

- డా.ఇమ్మానేని సత్యసుందరం