సబ్ ఫీచర్

చరిత్రను చదివిస్తున్న చక్రపాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక శాస్త్రాలు, చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించి పాలకులకున్న చిన్నచూపు వల్ల కొత్తగా వస్తున్న తరాలకు తెలంగాణ చరిత్రే తెలియకుండా పోయే స్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక తెలంగాణ చరిత్రం సంస్కృతి, కళలకు సంబంధించి కొత్తతరం చదువుకుకునే స్థితి వచ్చింది. ఆ స్థితి రావడానికి ప్రధాన కారకుడు ప్రొఫెసర్‌ఐ ఘంటా చక్రపాణి. ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాక సిలబస్‌లో సంపూర్ణ మార్పులు చేశారు. ప్రధానంగా గ్రూప్ వన్, గ్రూప్ టు పరీక్షల దగ్గరనుంచి ఉపాధ్యాయ పోస్టుల నియామకాల వరకు తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఈ తరం చేతిలోకి తెలంగాణ చరిత్ర సంస్కృతి వచ్చింది.
రాష్ట్రం వచ్చేవరకు తెలంగాణ చరిత్ర అంటే విశ్వవిద్యాలయాల్లో చరిత్ర విభాగం, డిగ్రీ కాలేజీల్లో సాంప్రదాయ డిగ్రీ చదివే విద్యార్థులకు, ఇంటర్ బిఏలో చరిత్ర పాఠాలు తప్ప ఇతరులకు సంబంధించినది కాదన్నట్టు చూశారు. ఇక యుజిసి ఇచ్చే నిధులతోటి విశ్వవిద్యాలయాలు, కొన్ని డిగ్రీ కాలేజీలలో చరిత్రపై సెమినార్లు నిర్వహించడం, ఆ సదస్సులో ప్రకటించిన నిష్ణాతుల అభిప్రాయాల పేపర్లు, ఆ సెమినార్‌పై వచ్చిన పేపర్లన్నింటిని కలిపి 500 లేక 1000 కాపీలు ముద్రించి వదిలివేయడం రివాజుగా వచ్చింది. ఇక చరిత్రకు సంబంధించిన పరిశోధనలు అనేకం జరుగుతున్నప్పటికీ తెలంగాణ మట్టికి సంబంధించిన పరిశోధనలు, ఈ నేలపై జరిగిన విరోచిత పోరాటాల, ఉద్యమాలు, ఇక్కడి స్థానికత అంశాలపై జరిగిన పరిశోధనలు జరగాల్సినంతగా జరగలేదు. తెలంగాణ చరిత్ర అంటే విద్యాలయాల్లో అదొక అకడమిక్ ర్యాక్‌గా మిగిలిపోయే స్థితి వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాక తెలంగాణ చరిత్రను సిలబస్‌లో చేర్చడంతో నూతన అధ్యాయం మొదలైంది. తెలంగాణ చరిత్రలోని భిన్న కోణాలు, ఇప్పటి వరకు చూడని, మనం విస్మరించిన మన చరిత్రను తెలంగాణ సమాజం చేతుల్లో పెట్టడానికి ప్రధాన కారకుడు ఘంటా చక్రపాణి. తెలంగాణ చరిత్రను సిలబస్‌లో పెడుతున్నట్టు ప్రకటించగానే అది మేం చదువుకోలేదు కాబట్టి దాన్ని మాకు చేర్చవద్దని పబ్లిక్ కమిషన్ ఆఫీసుపై కొందరు పిల్లల చేత దండయాత్ర చేయించే పని జరిగింది. తెలంగాణ చరిత్ర మన రాష్ట్రం వరకే పరిమితం కాకుండా భవిష్యత్‌లో జరుగబోయే సివిల్స్ పరీక్షల్లో కూడా 29వ రాష్ట్రం అవతరణ దాని నేపథ్యాన్ని అధ్యయనం చేయవలసిన పరిస్థితి రాబోతోంది. ఇటీవల 29 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కలయిక హైదరాబాద్‌లో జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 28 మంది పబ్లిక్ కమిషన్ల చైర్మన్లు తెలంగాణ చరిత్ర, ఇక్కడి కళలు, సంస్కృతి గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఈ చరిత్రను దేశమంతా అధ్యయనం చేసే దశకు తీసుకెళ్లడం వెనుక ఘంటా చక్రపాణి కృషి మరువలేనిది.
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ చరిత్ర పుస్తకాలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ఈ రెండేళ్ల కాలలో కోట్లాది రూపాయల పుస్తకాల విక్రయాలు జరిగాయి. ఇది పెద్ద రికార్డు. తెలుగు అకాడమి ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ చరిత్రపై ఇన్ని పుస్తకాలు ఏనాడు ముద్రించలేదు. ఇప్పుడు తెలుగు అకాడమి తెలంగాణ చరిత్రపై ప్రత్యేకించి పుస్తకాలు తయారు చేసి ఈ తరం పిల్లల చేతికందించింది. ఒక్కొక్క పుస్తకం 20 వేల కాపీలను ముద్రించింది. ఇంగ్లీషులో, తెలుగులో 11 రకాల పోటీ పరీక్షలకు పుస్తకాలను అకాడమీ ముద్రించింది. కాగా ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సాహితీవేత్తలు, రచయితలు, పౌర సమాజం గురించి విశే్లషించే సామాజిక శాస్తవ్రేత్తలు తెలంగాణ చరిత్రపై వందకు పైగా పుస్తకాలను రచించారు. తెలంగాణ చరిత్రపై ఇంత పెద్ద ఎత్తున పుస్తకాలు ఎప్పుడూ రాలేదు. నవ తెలంగాణ, నవ చేతన, అడుగుజాడలు పబ్లికేషన్స్, స్పృహ సాహితీ సంస్థ, వీక్షణం ప్రచురణలు, రామయ్య విద్యాపీఠం, రాజ్ సిరీస్ పబ్లికేషన్స్ పేర్లతో అనేక పుస్తకాలు మార్కెట్‌లోకి ప్రవేశించాయి.
చుక్కారామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్, అడపా సత్యనారాయణ వంటి నిష్ణాతులైన వ్యక్తులకు సిలబస్ తయారు చేసే కమిటీలో వేసి మేధోమధనం అనంతరం సర్వీస్ కమిషన్ సిలబస్ విడుదల చేయడం జరిగింది. నూతన రాష్ట్రం ఏర్పడటం, గత చరిత్రతో పాటు, సమకాలీన చరిత్రను ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో సిలబస్ తయారుచేయడం జరిగింది. సోషియాలజీ, చరిత్ర, తెలంగాణ సామాజిక మూలాలు, సంస్కృతి కళలను సిలబస్‌లో భాగం చేశారు.
పాత చరిత్ర, గతం నుంచి సిలబస్‌లో వస్తున్న విషయాలన్నింటిని సిలబస్‌లో చేర్చారు. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో పాలనా యంత్రాంగంలో పనిచేసే వారికి ప్రాంతీయ అవగాహన ఉండటం కోసం ఈ సిలబస్‌లో చేర్చడం జరిగింది. ప్రాంతీయత అన్న ఆలోచనలు, వృత్తి కులాలు, సబ్బండ వర్ణాలు-సంస్కృతి, ప్రజా ఉద్యమాలు, తెలంగాణ పోరాటాల చరిత్ర, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలు. 1969 నాటి ఉద్యమం, 42 రోజుల సమ్మె లాంటి సమకాలీన చరిత్రను సిలబస్‌లో చేర్చారు. ఇది చారిత్రాత్మకమైంది. ఏ జాతికైనా తన జాతి చరిత్ర మూలాలు తెలుసుకోవడం అవసరం. ప్రధానంగా స్థానిక పాలనా రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రాంతీయ అస్తిత్వం గురించి, ఈ మట్టి చరిత్ర గురించి కనీస జ్ఞానం ఉండాలన్న సోయితో వినూత్నంగా, ప్రయోగాత్మకంగా తెలంగాణ చరిత్రను సిలబస్‌లోకి పెట్టారు. ఇప్పటి వరకు చరిత్ర మరుగున పడిందన్న భావనను తుడిపేసేందుకు చక్రపాణి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ సిలబస్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. యుపిఎస్‌సి సిలబస్ మూసలో తెలంగాణ రాష్ట్ర సిలబస్ లేదు. గ్రూప్-1, గ్రూప్-2, పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, వైద్య ఆరోగ్యశాఖల్లో పోస్టుల భర్తీ కోసం తయారయ్యే విద్యార్థులు నూతన సిలబస్‌ను విధిగా చదువుకోవాలి. ఇందుకోసం దాదాపు 40% స్థానిక చరిత్రను సిలబస్‌లో చేర్చడం జరిగింది. కమిషన్ నిర్ణయాలను దేశంలోని వివిధ కమిషన్‌ల ఛైర్మన్లు ప్రశంసించారు.

-జూలూరి గౌరీశంకర్ సెల్ : 09440169896