సబ్ ఫీచర్

అమ్మ భాషకు ఏదీ గౌరవం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన మాతృభాషగా, ఎంతో ప్రాచీనతను కలిగి పరిపుష్టమైన తెలుగును, మనమే గౌరవించకపోవడం, దానిపట్ల నిర్లక్ష్యం వహించడమంత దౌర్భాగ్యం మరోటి లేదు. మన తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు కూడా తెలుగు భాషను రక్షించడానికి ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 1956నుంచి ఈనాటి వరకు పరిపాలనా వ్యవహారాల్లో తెలుగుకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం దురదృష్టకరం. 2008 సంవత్సరంలో మన తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చినా కూడా ఇంతవరకు దానికి సంబంధించిన విషయంపై మన ప్రభుత్వాలు ఉదాసీనతగా వ్యవహరించడం మన ఒక దౌర్భాగ్యం అని చెప్పాలి. ఎందుకంటే 2008 నుంచి తెలుగు భాషాభివృద్ధికి నిర్దేశించిన నిధులను వినియోగించకపోవడంవల్ల క్రమక్రమంగా కేటాయంపులు తగ్గుతూ రావటం గమనించాలి. మొదట్లో రూ.10 కోట్ల మేర కేటాయంపులుండగా క్రమంగా తగ్గుతూ 2011-14 మధ్యకాలానికి రూ. 2.5 కోట్లకు దిగజారింది. తెలుగు భాషకు సంబంధించిన పరిపాలనా కార్యక్రమాలు ఇంతవరకు తెలుగులో 20 శాతం కూడా అమలు కాలేదు. మన తెలుగు భాష గొప్పదని ఎంతగా చెప్పుకున్నా ఆ మేరకు ఇంతవరకు దాని అభివృద్ధికి తీసుకున్న చర్యలు లేవు. మన తెలుగువారు ప్రపంచంలో 14.5 కోట్లు ఉన్నప్పటికీ తమిళులకు తమ మాతృ భాష పట్ల ఉన్న మమకారంతో పోల్చితే మనకు భాషాభిమానం చాలా తక్కువ. తమిళ చిత్రంలో ఏ చిత్రం వచ్చినా అందులో పూర్తి తమిళానికే ప్రాధాన్యత నిస్తారు. మన తెలుగు భాషలో కూడా చాలా మంచి పదాలు ఉన్నా ఇంతవరకు మనకు ప్రజాబాహుళ్యంలోకి తీసుకరాలేకపోతున్నాం. తెలుగు భాషాదినోత్సవం నాడు మాత్రం మన పెద్దలు గొప్పగొప్ప మాటలు చెబుతారు. తరువాత షరామామూలే.
క్రీ.పూ.3500 నాటికి కూడా తెలుగుఉన్నది. ఈ విషయాన్ని మన భాష శాస్తవ్రేత్తలు నిరూపించారు. ఐక్యరాజ్య సమితి కూడా మాతృభాషా ప్రాధాన్యాన్ని గుర్తించింది. అమ్మభాషలో నేర్చుకున్నవే పిల్లల మనసులో నాటుకుపోతాయని స్పష్టం చేసింది. కానీ మనలో పెరిగిపోయన ఆంగ్ల భాషపట్ల మమకారం, మాతృభాషకు మనల్ని దూరం చేస్తున్నది. ప్రాథ మికోన్న స్థాయలోని పిల్లల్లో చాలామంది తెలుగులో రాయలేకపోవడం, చదవలేకపోవడానికి కారణం ఈ పరభాషా వ్యామోహమే. అట్లాగని పిల్లలు ఆ భాషలోనైనా ప్రావీణ్యత సాధిస్తున్నారా? అని ప్రశ్నిస్తే అందుకు లేదనే సమాధానం వస్తుంది.
భాషాభిమానం విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. తమ భాషాభివృద్ధి కోసం కేంద్రం నుంచి పోరాడి నిధులు తెచ్చుకుంటారు వారు. కానీ మనం కేటాయంచిన నిధులనే ఖర్చు చేయని దుస్థితి. ఇక తెలంగాణ సర్కార్ కెజి టు పిజి విద్యను ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశ పెట్టాలన్న ఉద్దేశంతో ఉంది. దీనివల్ల ఇప్పటి వరకు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తెలుగు పరిస్థితి మరింత దిగజారిపోతుంది.
తెలుగు భాష పట్ల రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నా అవన్నీ పైపేనే. ఒక్కటీ ఆచరణకు నోచుకోవడం లేదు. రెండు రాష్ట్రాల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా పడివున్న తెలుకు ఉపాధ్యాయ పోస్టులను పరిశీలిస్తే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉన్నదీ అర్థమవుతుంది. రాష్ట్రాల, దేశాభివృద్ధిలో భాషాభివృద్ధి కూడా కీలక పాత్ర వహిస్తుందన్న సత్యాన్ని గుర్తించాలి. అందువల్ల మాతృభాష తెలుగును మరింత పరి పుష్ఠం చేయాలి. భాషను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, వర్తమాన పరిణా మాలకు అనుగుణంగా అభివృద్ధి పరచాలి. అప్పుడు అమ్మభాషా, అందరి నోళ్లలో నాట్యమాడుతుంది. భాషను కాపాడుకోవాలంటే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటినుండైనా కృషి మొదలుపెట్టాలి.

- ముత్తన్నగారి రాజేందర్ రెడ్డి