సబ్ ఫీచర్

పాడమని అడుగవలెనా..? పాడుతా తీయగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాకీ నిక్కర్‌లు, శాండోబనియన్‌లు ప్రదర్శించి అది కొంటే యిది కొంటే దీనితో అది ‘‘ఫ్రీ’’అంటూ అమ్మే ఒక ‘‘మెగాషాపు’’కి ప్రారంభోత్సవం చేయడానికి ఒక వర్థమాన టి.వి, ఫిలిమ్ స్టార్ ‘‘రుచిర’’ వస్తోందీ అంటే కుప్పలు కుప్పలుగా ‘‘జీన్సు’’ ‘‘టీ-షర్టులు’’వచ్చిపడ్డారు. రిబ్బన్ కత్తిరించడానికి యింత హంగామావా? పైగా ‘‘లంగాలు’’, ‘‘గాగ్రాలు’’, ‘‘చుడీదారులు’’ వగైరా అమ్మకాలకి అమ్మడు రావడం బాగుంటది కాని శాండో బనియన్లు ఖాకీనిక్కర్లు లూనా? ఈ ‘‘రుచిర’’ లెగ్గీసు ఇంగ్లీషు షర్టువేసుకుని రావడానికి పోలీసు బందోబస్తుకీ, యింకా వగైరావగైరాకి సదరు ‘‘మెగా’’ షాపుల వారికి బాగా వదిలింది ‘‘చమురు’’-
కాని అమితాబ్‌బచ్చన్ ఒక క్రికెట్ పోటీ ప్రారంభోత్సవానికి వచ్చి పైగా దగ్గరనుంచి కూడా కాదూ, ముంబాయినుంచి కలకత్తాకి - ఆ సముద్రం నుంచి ఈ సముద్రం దాకా అన్నమాట- ‘‘ఎగిరి’’వచ్చి ‘‘బెంగాల్ మాత’’ మమతాదీది సరసన ‘‘బొషేర్ బొషేర్’’అంటూ నాలుగు బెంగాలీ మాటలు కూడా చెప్పి- జాతీయ గీతం జనగణమన ఆలాపన ఎత్తుకున్నాడంటే మాటలా?
సూపర్‌స్టార్‌లు వూరక వస్తారా? అన్నాడో వీరాభిమాని- ‘‘కనీసం నాలుగుకోట్ల రూపాయలు డిమాండ్ చేసి వుంటాడని విన్నాం’’ అన్నారు. కొందరు వీళ్లకి కర్ణపిశాచి వుంటుంది కాబోలు. అలా నాలుగు కోట్ల రూపాయలు లాగించాడు రుూ లాంగ్‌కోటు స్టార్ అన్న పుకార్లు షైర్లు చేస్తుండగా ‘‘అమిత్‌దా’’ (యిది బెంగాలీ టచ్) - ఆ వెనుక ధోనీ సేన, పాకిస్తాన్ పటాలం కూడా బుద్ధిగా నిలబడ్డారు- గొప్ప ‘‘అకేషన్’’ అదే-
‘‘ఇన్ని ‘‘టి-ట్వంటీ మ్యాచ్‌లు’’ జరుగుతున్నాయి, కాని మార్చి 19న జరిగిన రుూ మ్యాచ్‌కి ఎందుకంత హంగు? కలకత్తా ఈడెన్‌గార్డెన్ మైదానంలో జరిగిందనా?- కాదు. ఇండియా పాకిస్తాన్‌ల క్రికెట్ ‘‘స్పర్థ’’జరగబోతున్నదక్కడ. ఈ రెండు దేశాలమధ్య క్రీడాకారులు ‘‘యుద్ధం’’ యిది అనుకోకపోయినా, జనాలు మాత్రం అట్లా ‘‘హైప్’’యిచ్చేశారు. టి.ట్వంటీ చాలా ‘‘కురుచ క్రికెట్ మ్యాచ్ అంటే సాయంకాలం వచ్చి భోజనం వేళకి యిండ్లకు చెక్కేయొచ్చును. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కి మనవాడు ఎవరు? ఇంగ్లాండ్ మీద గెలిచి చొక్కా యిప్పి గాలిలో గిరగిరా మడిసెల త్రిప్పినట్లు త్రిప్పిన కలకత్తా వీరుడు సౌరభ్ గంగూలీ ‘బాస్’-
ఇంకో సంగతి వుంది- ‘‘మేం మా ‘టీము’ని ఇండియా పంపించం. అక్కడ వాళ్లకి (మా) టెర్రరిస్టుల ప్రమాదం వుంటుందీ’’అంటూ పాక్ బోర్డు. ‘‘బెట్టు చేస్తూంటే’’ మేం వున్నాం, మా ప్రాణాలొడ్డుతాం మా టీముని పదిలంగా తిరుగు టపాలో పంపించేస్తాం.’’అని కలకత్తా నగరి హామీ యిచ్చింది. ఈ రసగుల్లాలాంటి ప్రేమని చూసి మురిసిపోయి పాక్ జట్టు నాయకుడు- ‘‘నాకు యిక్కడే ఎక్కువమంది విసనకర్రలు’ ఉన్నారు’’ అన్నాడు. పాపం!
‘‘శల్య సారథ్యం చెయ్యకు భయ్యా! నిన్ను తిరిగి రాగానే పీకి పారేస్తాం’’అంటూ దిక్కుమాలిన హెచ్చరికలు కూడా పాక్ బోర్డునుంచి అందుకున్నాడు. అటువంటి, టి-20 కనుక దీనికి స్పెషల్ ఆర్భాటం. అమితాబ్ బచ్చన్ ఆగమనం కూడా గొప్పే. బాగా ‘‘పాడాడ’’న్నారు- శ్రద్ధగా భక్తిగా అంతా కలసి ఆలపించారు- కాని ‘‘కోడిగుడ్డుకు వెంట్రుకలు’’ వెతికే వాళ్లు ఎప్పుడూ వుంటారుగా- పైగా రుూ అమితాబ్ గానానికి ‘‘శభాష్ శభాష్’’అన్న ట్వీట్‌లు కూడా లభించాయి. అయినా ఒక పెద్దమనిషి వున్నాడు. పొలిటీషియన్ సుబ్రహ్మణ్యస్వామిగారి లాంటివాడు- అతని పేరు ఉల్హాస్ పి.ఆర్. ఉల్లాసంగా ఆయన లఘుచిత్రాలు తీస్తూ వుంటాడు. ‘‘అమితాబ్ జాతీయ గీతానికి ఘోర అపచారం చేశాడు’’అంటూ దేశ రాజధాని ఢిల్లీలో న్యూఅశోక్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. గీతాలాపన యాభై రెండు సెకనులలో ముగించాలి కాని మన సూపర్‌స్టార్‌గారు డెబ్భయి సెకనులకి సాగదీశాడు- అదీ కేసు. నిజానికి ‘‘అమిత్‌దా’’ ప్రక్కనే సౌరభ్‌దా కూడా రుూ పాట పాడుతున్నప్పుడు ‘‘ఉజ్వల’’ జలధితరంగా అంటూ ఆలపించారు. కాని ఉల్లాస్‌గారు స్పెల్లింగ్‌లో ‘‘లీకు’’కాబోలు కాకపోతే సింధ్ అనాలి. ‘‘సింధు’’అన్నాడని మాత్రం తన కంప్లయింట్‌లో రాశాడు. అఫ్‌కోర్సు మనకివాళ సిధ్‌లేదు ‘‘సింధు’’ లేదూ- మనకి కాకపోతే రుూ ఉల్లాస్‌ని ఒకందుకు మెచ్చుకోవాలి. లోగడ పోయిన ఏడాది నవంబరు 21న పి.కె. చిత్రం రిలీజ్ సందర్భంలో ఆమీర్‌ఖాన్ మీద ఉల్లాస్‌రే కేసు పెట్టాడు.
పాపం అంత శ్రమపడి దేశానికి అడ్డంగా ఎగిరి వచ్చి జాతీయ గీతం ఆలపించి ఆనక పెద్ద జాతీయ పతాకం చేతబూని సచిన్ ప్రక్కన కూర్చొని అతనికన్నా జోరుగా దాన్ని హిలాయించిన అమితాబ్ నీలాపనిందలపాలైనాడు. అసలు నాలుగు కోట్లు కాదుకదా? నాలుగు రూపాయిలు కూడా తీసుకోలేదుట. సాధారణంగా సినిమా స్టార్స్ ‘‘లాగులు’’ (దుస్తులు) డైలాగులు కూడా సొంతం తెచ్చుకోరు. రెండూ స్టూడియోలో యివ్వబడతాడు. కాని రుూ ‘‘సంబురానికి’’ వచ్చి అటు పాకిస్తాన్‌లో కూడా వున్న తన ఫ్యాన్స్‌ని కూడా ఆకర్షించాను’’ అనుకున్న బచ్చన్‌జీ- తన టిక్కెట్ తానే కొనుక్కున్నాడుట! హోటల్ కిరాయి తిండి వగైరా ఖర్చులు ‘‘టిప్స్’’లో సహా తానే తన ‘‘పోకట్’’లో నుంచి తీసి చెల్లించాడుట. సౌరభ్ మాటలుచూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అందరికీ-బ్యాట్ పట్టుకుంటే- బ్యాటు మీద ప్రకటన బిల్లు అతికించుకుంటే మైదానంలో పరిగెడుతూ బూట్ మీద బ్రాండ్ కనపడేలాగా- లేసులు యిప్పి తిరిగి ముడిపెట్టుకుంటే- ‘‘పైసలు’’ ఐమీన్ రూపాయలు వసూలుచేసిన గంగూలీకి యిది ఆశ్చర్యమే- కాని 30 లక్షల రూపాయలు కష్టార్జితం శ్రీ అమితాబ్బచ్చన్- తన క్రికెట్ అభిమానం చాటుకోడంకోసం ఖర్చుచేశాడు కాని ఉల్లాస్ భాయ్ దాన్ని గుర్తించలేదు. ‘‘టైమ్ ఎక్సీడ్ అయ్యాడు కనుక ఎక్‌స్ట్రా సెకనుకి యింతా అని జరిమానా కట్టు అని అడిగినా బాగుండు మరో ‘‘పొట్టి సినిమాకి’’ పెట్టుబడి దొరికేది.
బైది బై 19, మార్చిన ఇండియా దట్ ఈజ్ భారత్ పాకిస్తాన్ మీద గెలిచిందిగా. దాంతో ఆఫ్రీదీ భాయ్ మరింత యిరుకునపడ్డాడు. తిమిటెట్ ఓవర్ ట్వంటీ - ట్వంటీ క్రికెట్‌లో మనమీద పాకిస్తాన్ యింకా యింతవరకు బోణీ చెయ్యలేదు. కలకత్తాలోని అదే అలవాటు పనిచేసింది ఆ టీము.
సచిన్, అమితాబ్‌లు కూడా అందరిలాగే గొప్ప హ్యాపిగా యిండ్లకు పోయారు హిప్ హిప్ హుర్రే అంటూ-
లాంగ్ లివ్ ‘‘షార్ట్ క్రికెట్’’!